జాతీయ వార్తలు

ఆప్‌ ఎంపీ భగవంత్‌ మాన్‌పై సస్పెన్షన్‌ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భద్రతా వ్యవస్థను దాటుతూ, పార్లమెంట్‌లోకి ఎలా ప్రవేశించాలో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్‌ మాన్‌ను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ ఆదేశాలు జారీచేశారు. మాన్‌పై విచారణకు 9మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశామని, కమిటీ ఆగస్టు 3న నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. అప్పటివరకు ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకూడదని స్పీకర్‌ తెలిపారు. ఇప్పటికే భేషరతుగా భగవంత్‌ మాన్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ, చర్యలు తప్పవని స్పీకర్‌ పేర్కొన్నారు.