ఆరోగ్య భాగ్యం

బరువు - సంతానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్‌గారూ! నా వయస్సు 22 సంవత్సరాలు. నేను చాలా లావుగా ఉంటాను. నా బరువు 86 కిలోలు. నా పొడుగు 5 అడుగులా 3 అంగుళాలు. పైగా నాకు పెళ్లి అయి నాలుగేళ్ళయినా పిల్లలు కలుగలేదు. నా బరువుకీ, సంతానానికీ ఏదైనా సంబంధం ఉందా? నాకు పీరియడ్స్ రెండు, మూడు నెలలకోసారి వస్తాయి. నాకు మొదటినుంచీ ఇలాగే పీరియడ్స్ వచ్చేవి. ఇంతవరకూ నేను దీని గురించి ఏ డాక్టరుగారి సలహా తీసుకోలేదు. మీరు సలహా చెప్పగలరు?
-ఒక సోదరి, నిజామాబాద్
జవాబు: సోదరీ! నీ స్థూలకాయం తగ్గితే కానీ పీరియడ్స్ సరిగా రావు. ఆపై కొన్ని మందులు కూడా వాడి నెలనెలా పీరియడ్స్ వచ్చేట్టు చూసుకోవాలి. అల్టా సౌండ్ టెస్టు డాక్టరు సలహాతో చేయించుకోండి. మధుమేహం, థైరాయిడ్ టెస్టులు కూడా అవసరం కాబట్టి అవి కూడా చేయించుకోండి. మీ ఊర్లో మంచి గైనకాలజిస్టు దగ్గర చికిత్స తీసుకోండి.
డాక్టరుగారూ! నా వయసు పదహారు సంవత్సరాలు. నేను పదోతరగతి చదువుతున్నాను. నాకు రోజూ సాయంత ం పూట కొద్దిగా జ్వరం వస్తోంది. తెల్లవారేసరికి అదే తగ్గిపోతోంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి కానీ తక్కువగా బ్లీడింగ్ అవుతోంది. నా బరువు 39 కిలోలు. అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. నాకేమైందో చెప్పగలరా? ఏమైనా కాన్సర్ వచ్చిందా? చాలా భయం వేస్తోంది డాక్టర్..
-జలజ, మంచిర్యాల
జవాబు: జలజా! నువ్వు వెంటనే మంచి ఫిజీషియన్ దగ్గరికి వెళ్లి రక్తపరీక్షలు, సీబీపీ, ఇ ఎస్ ఆర్, మాన్‌టోక్స్ వంటి పరీక్షలు చేయించుకో. టి.బి. వంటి వ్యాధి మొదలైందేమో ఒకసారి చూపించుకో.. అవసరమైతే ఛాతికి ఎక్స్ రే కూడా తీస్తారు. ఈ రోజుల్లో టి.బి. చికిత్స చాలా తేలిక. త్వరగా తగ్గించే మందులున్నాయి. ఆరు నెలలు శ్రద్ధగా చికిత్స తీసుకోవడంతో పాటు, మంచి ప్రో టీనులున్న ఆహారం అంటే పాలు, పండ్లు, కోడిగుడ్డు రోజూ తింటే చాలా మంచిది. అలాగే థైరాయిడ్ పరీక్ష కూడా చేయించుకోవాలి. ఈ వయస్సులో కాన్సర్ రావడం చాలా అరుదు. అనవసరంగా భయపడకు.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో