ఆరోగ్య భాగ్యం

సాధారణ ప్రసవం మంచిదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిది నెలలు శిశువును తన గర్భంలో మోసి ప్రసవం తర్వాత పాపని చూసుకుని మురిసిపోవడం, ప్రసవంలో తాననుభవించిన బాధను మర్చిపోవడం తల్లికి సాధారణం. శిశువు సరిగా పెరిగి, తల్లి శరీరం ఆరోగ్యంగానూ, ప్రసవమార్గంలో ఎముకలు, కండరాలు పటిష్టంగాను, విశాలంగానూ ఉంటే ప్రసవం మామూలుగా అవుతుంది. ఇందులో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ప్రసవం కష్టమై, శిశువుగానీ, తల్లిగానీ లేక ఇద్దరూగానీ ప్రాణాపాయస్థితి పొందుతారు. దీనిని దృష్టిలో పెట్టుకోకుండా ఫలానా వైద్యులు ధనం కోసం- సాధారణంగా అయ్యే కాన్పుకు కూడా ఆపరేషన్లు చేస్తారు అనుకోవడం సరికాదు. అన్ని రంగాల్లో వున్నట్టే వైద్యరంగంలో కూడా కొందరు అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. గమనించవలసిన విషయం ఏమిటంటే- ఈ మధ్య కాన్పుల్లో తల్లిమరణాలు (మెటర్నల్ డెత్స్) లేదా కష్ట కాన్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తల్లీపిల్లా కులాసాగా వుంటున్నారు.
అసలు ఈ ఆపరేషను కాన్పు (సిజేరియన్)కి సరైన కారణాలేవి? అంటే వైద్య పరిభాషలో వీటిని మూడుగా విభజిస్తారు.
1. పాసేజ్ 2. పాసెంజర్ 3. ఫోర్సెస్
మొదటి కారణం ప్రసవద్వారం చిన్నదిగానో, వంకరటింకరగానో ఉండటం. దీనే్న పెల్విక్ ఫాక్టర్ అంటారు. కొంతమందికి వారి ఎముకలు చిన్న పరిమాణంలో ఉండి ఐదు అడుగులు లేక అంతకంటే తక్కువ పొడుగుతో ఉంటారు. వీరికి శరీరానికి తగినట్టుగా పెల్విక్ ఎముకల గూడు చిన్నదిగా ఉంటుంది. లేదా ఒక ఎముక ముందుకు పొడుచుకు వచ్చినట్టు (ప్రొజెక్టింగ్ ఇన్‌సైడ్) ఉండవచ్చు. అది శిశువు కిందికి జారి సాధారణ ప్రసవం జరగడానికి అడ్డంగా ఉండి బిడ్డ తలకి గాయం చేయవచ్చు. దీనినే కంట్రాక్టెడ్ పెల్విస్ అంటారు. పెద్దవారి తల పుర్రె ఎముక గట్టిగా ఉండడం వల్ల చిన్న చిన్న దెబ్బలకు ఏమీ కాదు. అదే గర్భస్థ శిశువు తల ఎముకలు మెత్తగా ఉండడంతో ఏమాత్రం వత్తిడి తగిలినా లేక గీరుకుపోయినా లోపలి మెదడు దెబ్బతింటుంది. ఎక్కువ దెబ్బలు తగిలితే మృత శిశువు పుట్టడం కానీ, తక్కువ దెబ్బలు తగిలితే మానసిక వైకల్యం, బుద్ధిమాంద్యం, ఫిట్సు లాంటివి వచ్చే అవకాశం ఉంది. దీంతో బతికున్నంత కాలం ఆ శిశువుకు, ఇటు తల్లిదండ్రులకు కూడా వేదన మిగులుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని శిశువు బరువు, పరిమాణం సాధారణంగా ఉంటే ఫోర్సెప్స్, వాక్యూముల వంటి సాధనాలు ప్రమాదకరం అని నిపుణులు నిర్ధారిస్తే సిజేరియన్ ద్వారా శిశువుని బయటకు తీయాలి. ఒకవేళ బలవంతంగా కాన్పుచేస్తే తల్లి జననేంద్రియాలు శాశ్వతంగా దెబ్బతిని, మూత కోశవ్యాధులు, మలద్వార సమస్యలు, ప్రోలాప్స్ వంటి దుష్పరిణామాలు కలుగుతాయి. 3సేఫ్ మదర్ సేఫ్ బేబీ.. అనే స్లోగను అందరికీ తెలిసినదే కదా!
పల్లెటూర్లలో వైద్య సదుపాయం లేని చోట్ల నాటు మంత్ర సానులు, ట్రైనింగ్ లేనివారు మొరటుగా చేసిన కేసులెన్నో గవర్నమెంటు ఆసుపత్రికి వచ్చి చూపించుకుంటారు. ముఖ్యంగా మూత్రం, మలం కంట్రోలు లేకపోతే చాలా కష్టం. ఆ స్ర్తీలకు సపర్యలు చేసేవారికీ నరకమే.
ఇక రెండోది పాసెంజర్ అంటే ఇక్కడ శిశువు ఆ దారిలో ప్రయాణించి సక్రమంగా బాహ్య ప్రపంచంలోనికి ప్రవేశించాలి. పాప బరువు నాలుగు కిలోల కంటే ఎక్కువగా ఉంటే సాధారణ ప్రసవం కష్టం. అందులో పెల్విస్ దానికి తగ్గ పరిమాణంలో లేకపోతే కాన్పు మధ్యలో స్తంభించి (అబ్‌స్ట్రక్టియో లేబర్) బిడ్డకి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవ్వచ్చు. తల్లి డిస్‌ట్రెస్‌లోకి వెళ్లి గాభరా పడవచ్చు. మరో కారణం శిశువు తలకిందికి లేకుండా పైనో, పక్కకో వుంటే కూడా ప్రసవం కష్టం. తల పైకి కాళ్లు కిందికి వుంటే బ్రీచ్ అని పిల్ల అడ్డంగా వుంటే ట్రాన్స్‌వర్స్ లై అని అంటారు. ఈ రోజుల్లో అల్ట్రా సౌండ్ అనే మార్గం వుండబట్టి ఈ పరిస్థితి ముందే తెలిసి ఎలా కాన్పు చేయాలో కొద్దిరోజుల ముందే నిర్ణయించుకోవచ్చు. పేషెంట్‌కి, బంధువులకీ కూడా అర్థం అవుతుంది.
తర్వాత ఫోర్సెస్.. అంటే గర్భాశయం యొక్క శక్తి. నొప్పులు క్రమంగా ఎక్కువై శిశువు తలను నెమ్మదిగా కిందివైపునకు జరిపేటట్టు ఉండాలి. మొదట్లో చిన్నగా మొదలై దగ్గర దగ్గరగా ఐదు, ఆరు నిముషాలకు ఒకసారి రావాలి. దాని యొక్క బలం (స్ట్రెంగ్స్ ఆఫ్ కన్‌ట్రాక్షన్) కూడా క్రమేపీ పెరగాలి. అప్పుడే సక్రమమైన విధానంలో బిడ్డ బయటకు వచ్చి వెంటనే చురుకుగా, మంచి బలమైన ఏడుపుతో (స్ట్రాంగ్ కై ) ఊపిరి తనంత తానుగా తీసుకుంటుంది. ఈ నొప్పులు సక్రమంగా వస్తున్నాయా లేక అపసవ్యంగా వచ్చి తగ్గిపోతున్నాయా అనేది ముఖ్యం. దీనికి తగిన మందులు, ఇంజక్షన్లు, ముద్ద (జెల్) మందులు వాడి ప్రయోజనం లేకపోతే ఆమె సమ్మతి పత్రం తీసుకుని వైద్యులు సరైన సమయంలో సిజేరియన్ చేసి బిడ్డను, తల్లిని కాపాడుతారు. ఇద్దరి ప్రాణాలతో ఎవరికీ అపాయం కలుగకుండా చికిత్స చేసే వైద్యులు కత్తిపై నడకవంటి పరిస్థితుల్లో పనిచేస్తారు. ఈ విషయం ప్రజలు సహృదయంతో అర్థం చేసుకోవాలి. కౌన్సిలింగ్ ఎండ్ కన్విన్‌సింగ్ అనే రెండు భాగాలు ఎంతో ముఖ్యం. ఆఖరున ఒక విషయం.. వయస్సు 35 సంవత్సరాలకు మించినా, ఆమె సాధారణ ప్రసవానికి భయపడి సుముఖంగా లేకపోయినా ప్రసవం కాక, ఆపరేషన్ అవసరం ఉండవచ్చు.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో