ఆరోగ్య భాగ్యం

నెలసరిలో చికాకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీ యువతికి రజస్వల మొదలు నెల నెలా వచ్చే బయటలు ఆగిపోయేవరకు కొద్దిరోజులు అటు ఇటుగా ఠంచనుగా రక్తస్రావం అవ్వడం సహజం. కానీ, కొంతమందికి నెలలో రెండుసార్లు లేదా 1 1/2 - 2 నెలలకి ఒకసారి వచ్చి, మరీ ఎక్కువగానో లేదా చాలా కొంచెంగానో రక్తస్రావం అవుతుంది. అటువంటప్పుడు వైద్య పరీక్ష తప్పనిసరిగా చేయించాలి.
అధిక రక్తస్రావానికి కారణాలలో ముఖ్యమైనవి రెండు- ఒకటి హార్మోనుల అసమతుల్యం (హార్మోనల్ ఇన్‌బాలెన్స్), రెండవది గర్భాశయం లేక అండాశయాలలో గడ్డలు. ఏది కారణమో నిర్ణయించాల్సింది నిపుణులైన గైనగాలజిస్టులు. కాబట్టి వారి సలహాతో వివిధ పరీక్షలు అల్ట్రాసౌండ్, థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి.
హార్మోనులవల్ల ఇబ్బంది అయితే తగిన హార్మోనులు ఉపయోగించి పరిస్థితి చక్కబరుస్తారు. గర్భసంచిలో వచ్చే గడ్డల్ని ఫైబ్రాయిడ్ గడ్డలు అంటారు. ఈ రకం గడ్డలు కేన్సరుకి సంబంధించినవి కాకపోయినా చికాకు కలిగించే రక్తస్రావం, నొప్పి మొదలైన బాధలు స్ర్తి జీవితాన్ని చిందర వందర చేస్తాయి. వీటికి శస్త్ర చికిత్స ఒక్కటే కాకుండా ఈమధ్య కొత్తగా వచ్చిన నోటి బిళ్లలు కూడా వాడవచ్చు.
ఓవరీలలో వచ్చే నీటి బుడగలు, ట్యూమర్లు, సిస్టులు కూడా అదిక రక్తస్రావానికి కారణాలు కావచ్చు. దానికి కూడా సిటి స్కాన్ వంటి పరీక్షలు, ఇతర సాధనాలు వాడి కూడా నిర్ధారించి తగిన చికిత్స చేయాలి.
మధ్య వయసు వారికి అంటే 40 సం.లోపు వారికి ఫైబ్రాయిడ్ గడ్డలు మాత్రం మయోమెక్టమీ అనే సర్జరీ వల్ల తొలగించాలి. తర్వాత వచ్చే గర్భధారణ మామూలుగానే సాగుతుంది కాని వీరికి సాధారణ ప్రసవం అయే అవకాశం 20-25 శాతం మాత్రమే వుంటుంది. అదే ఓవరీ గడ్డలు తీసిన వారికి సాధారణంగానే ప్రసవం జరుగుతుంది. చివరగా ముఖ్యమైన విషయం ఏమిటంటే- హార్మోను బిళ్లల్ని వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా షాపులో కొని వాడేవారికి చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ మందులు రెండు వైపులా పదునుగల కత్తితో సమానం. కొన్ని మందులు (ఏస్పిరిన్ లాంటివి) కూడా కారణవౌతాయి అధిక రక్తస్రావానికి.

-- డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో