ఆరోగ్య భాగ్యం

గర్భిణి-వ్యాయామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భం దాల్చిన స్ర్తికి మొదటి 2-3 నెలలు కొం చెం ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే వేవిళ్లు, నీరసంతో చాలా బాధ పడుతుంది. ఆ సమయంలో ఫామిలీ సపోర్టు, వైద్య సలహాలు మందుల కంటే ఎక్కువ ఫలితాన్నిస్తాయి. కొద్ది కొద్దిగా ఆహారం 2-3 గంటలకొకసారి తీసుకోవాలి. వికారం, వాంతులు విపరీతంగా వుంటే వైద్యులు విటమిన్ బి6 వుండే మందుబిళ్లలు, ఫోలిక్ ఆసిడ్ బిళ్లలు ఇస్తారు. కొంతమందికి చాలా ఎక్కువ వాంతులై శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి కళ్లు తిరిగి పడిపోతుంటారు. అలాంటి స్ర్తిలకు గ్లూకోజ్‌ను ఇంజెక్షన్ ద్వారా ఇవ్వాలి. ఇటువంటి సమయంలో వ్యాయామం పనికిరాదు. నాలుగైదు నెలల తర్వాత ఆహారం బాగా తీసుకుని కొంచెం కోలుకున్న తరుణంలో వాకింగు లాంటివి చేయగలుగుతారు.
ఆ తర్వాత రక్తహీనత, బీపీ, వాపులు లేకుండా ఆరోగ్యంగా ఉంటే, ఇంటి పనులన్నీ సులువుగా చేసుకోవచ్చు. అయితే నెల నెలా ఆరోగ్య కేంద్రంలోగాని గవర్నమెంటు లేక ప్రయివేటు వైద్యశాలకు వెళ్లి వైద్యులు చెప్పిన సూచనలు పాటించాలి. ఒకవేళ వారు ఏదైనా హెచ్చరిక చేస్తే దాని ప్రకారం నడుచుకోవాలి. ఏ కాంప్లికేషనూ లేకుంటే నడక, చిన్నపాటి యోగాభ్యాసం పాటించవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన కపాల ఛాతి వంటి యోగా పాటిస్తే నార్మలు ప్రసవం అయ్యే అవకాశం వుంటుంది. రోజూ రెండు పాదాలమీద బరువానించి కొంచెం సేపు కూర్చుంటే కటి ప్రదేశంలోని కండరాలు, లిగమెంట్లు మెత్తబడి, సుఖప్రసవం అవుతుంది.
చాలామంది మెట్లు ఎక్కడానికి భయపడతారు. మెట్లు నెమ్మదిగా ఆయాసపడకుండా ఎక్కితే ఏమీ ప్రమాదం లేదు. మెట్లమీదినుంచి కాలు జారే ప్రమాదం లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంతే!
కాళ్లు, చేతులు కదిలిస్తూ వుంటే రక్తనాళాల్లో ఏర్పడే చిన్న చిన్న గడ్డలు రావు. (వీనస్ త్రోంబోసిస్) ఊపిరితిత్తులు విశాలమయ్యే వ్యాయామంతో అక్క డి రక్తప్రసారం చక్కగా జరిగి తల్లికి బిడ్డకి కూడా ఆక్సిజను సరఫరా బాగా జరుగుతుంది.
ఒకవేళ బీపీ, వాపులు లేక ఇదివరలో గర్భసంచికి కుట్లుపడినట్లయితే గాని కడుపులో కవలలు లేక ఉమ్మనీరు తక్కువ ఉంటే వ్యాయామం పనికిరాదు.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో