ఆటాపోటీ

బిసిసిఐ ప్రక్షాళన కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రక్షాళన మొదలైంది. అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలపై వేటు వేసిన సుప్రీం కోర్టు తాజాగా నలుగురు పాలనాధికారులను నియమించడంతో బోర్డు స్వరూపం మారింది. కానీ, లోధా కమిటీ సిఫార్సులను మాజీ కంప్ట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, ప్రముఖ చరిత్రకారుడు, కాలమిస్టు రామచంద్ర గుహ, ప్రముఖ ఆర్థికవేత్త విక్రం లిమాయే సభ్యులుగా ఉన్న కమిటీ ఎంత వరకు అమలు చేయించగలుగుతుందన్నదే అనుమానం. ఎక్కువ శాతం బోర్డు సభ్య సంఘాల్లో ఇష్టారాజ్యం, నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం నిరాటంకంగా కొనసాగుతున్నది. పలు సంఘాలు కోర్టు కేసుల్లో మునిగితేలుతున్నాయి. కొత్త కమిటీ ముందున్న సవాళ్లలో ఇది ప్రధానమైనది. మరోవైపు దేశంలో క్రికెట్‌పై తన పట్టును కొనసాగించడానికి బిసిసిఐలోని ప్రస్తుత, మాజీ అధికారులు చాలా మంది ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉన్నారు. మ్యాచ్‌లను నిర్వహించే స్థితిలో లేమంటూ కొన్ని సభ్య సంఘాలతో చెప్పించడం, సిరీస్‌లు రద్దవుతాయేమోనని భయపెట్టడం ఈ ప్రయత్నాల్లో భాగమే. సుప్రీం కోర్టు ఆదేశాలతో బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేతోపాటు ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కారణంగా పరువు కోల్పోయిన మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ కూడా ఇటీవల బెంగళూరులో సమావేశమయ్యారు. బిసిసిఐ తమ గుప్పిట్లో నుంచి పోకుండా జాగ్రత్త పడాలన్నదే వారి ఆంతర్యం. అది సాధ్యంకాకపోతే, కొత్తగా మరో క్రికెట్ బోర్డును నెలకొల్పాలన్న ఆలోచన కూడా కొంతమందిలో ఉంది. తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీనివాసన్ గతంలో మాదిరిగానే భారత క్రికెట్‌ను తన ఆధీనంలో ఉంచుకునేందుకు పాచికలు వేశాడు. భారత్, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వలేమంటూ బిసిసిఐకి లేఖ రాశాడు. ముంబయి ముందుకు రాకపోతే, భారత్ పరువు బజారున పడేది. బిసిసిఐ సభ్య సంఘాలు ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ ఎత్తులు, జిత్తులను నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి.
పాత సమస్యలే..
సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సుభ్యుల కమిటీ ముందు పాత సమస్యలే ఉన్నాయి. కొత్త పరిష్కార మార్గాలను అనే్వషించాల్సి ఉంటుంది. లోధా సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేసిన బిసిసిఐ అధికారులు చివరికి సుప్రీం కోర్టు ఆదేశాలతో తోక ముడిచారు. కానీ, వారు బోర్డుపై పెత్తనాన్ని పూర్తిగా వదులుకుంటారని, ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా, తెరవెనుక రాజకీయాలు నడిపించకుండా వౌనం వహిస్తారని అనుకోవడానికి వీల్లేదు. లోధా సిఫార్సులను అమలు చేయకుండా బిసిసిఐ చాలాకాలం నెట్టుకొచ్చిన విషయం బహిరంగ రహస్యం. ఈ ప్రతిపాదనలను అమలు చేస్తామంటూ అఫిడవిట్‌ను దాఖలు చేస్తే తప్ప సభ్య సంఘాలకు ఎలాంటి చెల్లింపులు జరపరాదని లోధా కమిటీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, విదర్భ, త్రిపురను మినహాయిస్తే, మిగతా క్రికెట్ సంఘాలు ఇప్పటి వరకూ ఆ దిశగా అడుగులు వేయని పరిస్థితి. ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసును, బిసిసిఐలో జరుగుతున్న అవినీతిని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో ఎండగట్టింది. తద్వారా కమిటీ నుంచి ఏం కోరుకుంటున్నదో చెప్పకనే చెప్పింది. కాబట్టి భారత క్రికెట్‌ను పారదర్శకంగా ఉంచేందుకు ఈ కమిటీ శక్తివంచన లేకుండా కృషి చేయాలి. లోధా కమిటీ ఇచ్చిన నివేదికలోని ప్రతిపాదనలు కింది స్థాయి నుంచి తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ క్రీడా బిల్లును ఆమోదించకపోవడంతో, ఈలోగా దేశంలో ఒకే రకమైన విధానం ఉండాలన్న డిమాండ్ పెరుగుతున్నది. ఈ మార్పు బిసిసిఐ నుంచే ప్రారంభం కావాలి. నలుగురు పాలనాధికారులపై ఉన్న బాధ్యతల్లో ఇది కూడా ఒకటి. అయితే, లోధా కమిటీ సిఫార్సుల్లో ఎక్కడా బిసిసిఐపై ప్రభుత్వ ఆజమాయిషీకి ఆస్కారం లేదు. దీనిని సాకుగా తీసుకొని సభ్య సంఘాలు సృష్టిస్తున్న, సృష్టించబోయే అడ్డంకులను నూతన కమిటీ ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి. సుప్రీం కోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని, అటు బిసిసిఐతోనూ, ఇటు దాని సభ్య సంఘాలతోనూ కఠినంగా వ్యవహ రించకపోతే, సభ్య సంఘాలు గాడిన పడవన్నది వాస్తవం. చాలా కా లం కొనసాగిన ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులు, సుప్రీం కోర్టులో కే సు, లోధా సిఫార్సుల అమలులో నిర్లక్ష్యం వంటి ఎన్నో సంఘటనలు బిసిసిఐ తీరును స్పష్టం చేస్తున్నాయ. - శ్రీహరి

చిత్రాలు..వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, విక్రం లిమాయే , రామచంద్ర గుహ