ఆటాపోటీ

మలింగ సూపర్ బౌలింగ్ (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఐపిఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, కొంత మంది బౌలర్లు కూడా ఈ టోర్నీపై తమదైన ముద్ర వేశారు. శ్రీలంక పేసర్ లసిత్ మలింగ (ముంబయి ఇండియన్స్) 98 ఇన్నింగ్స్‌లో 143 వికెట్లు పడగొట్టి, మేటి బౌలర్ల జాబితాలో నంబర్ వన్‌గా నిలిచాడు. అమిత్ మిశ్రా 112 ఇన్నింగ్స్‌లో 124, డ్వేయిన్ బ్రేవో 103 ఇన్నింగ్స్‌లో 122 చొప్పున వికెట్లు కూల్చారు. ఇక ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బౌలర్‌గా సొహైల్ తన్వీర్ రికార్డులకెక్కాడు. అతను 2008లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ చెన్నై సూపర్ కింగ్సపై కేవలం 14 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టాడు. 2016 ఐపిఎల్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ బౌలర్ ఆడం జంపా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 19 పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించాడు. 2009లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ అనిల్ కుంబ్లే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగులకే ఐదు వికెట్లు కూల్చాడు.

- సత్య