ఆటాపోటీ

‘చాంపియన్స్’ సవాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టు చాంపియన్‌షిప్ కారణంగా రద్దవుతుందనుకున్న చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జూన్ ఒకటి నుంచి అభిమానులను అలరించడానికి ముస్తాబవుతున్నది. ఎనిమిది జట్లు ఢీకొంటున్న ఈ టోర్నీలో భారత్ పాల్గొంటుందా లేదా అన్న అనుమానం చివరి క్షణం వరకూ కొనసాగింది. పాలనాధికారుల బృందం (సిఒఎ) ఆదేశాలతో దారికొచ్చిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఎట్టకేలకు జట్టును ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. ‘మినీ ప్రపంచ కప్’గా పిలిచే ఈ క్రికెట్ సంగ్రామంలో ఆధిపత్యాన్ని కొనాగించాలని డిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా పట్టుదలతో ఉన్నాయి. స్వదేశంలో జరుతున్న టోర్నీలో సత్తా చాటేందుకు ఇంగ్లాండ్ అస్త్రాలను సమకూర్చుకుంటున్నది. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తనదైన రోజున ఎలాంటి బలమైన జట్టుకైనా చుక్కలు చూపించే సత్తావున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైతం కదనానికి కాలుదువ్వడంతో, ఈ ‘చిన్న ప్రపంచ కప్’ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తున్నది.
భారత్ ప్రస్థానం
నిరుటి విజేతగా బరిలోకి దిగుతున్న భారత్ 1998లో ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పుడు సెమీస్ వరకూ చేరింది. కానీ, ఫైనల్‌లోకి అడుగుపెట్టలేక పోయింది. 2000లో జరిగిన రెండో చాంపియన్స్ ట్రోఫీలో దారుణంగా విఫలమై, రెండో రౌండ్ నుంచే నిష్క్రమించింది. కానీ, ఆతర్వాత పుంజుకొని, 2002 టోర్నీలో టైటిల్‌ను సాధించింది. 2004, 2006, 2009 సంవత్సరాల్లో అభిమానులను నిరాశపరుస్తూ, గ్రూప్ దశ నుంచే వెనుదిరిగింది. మొదటి రౌండ్ పరాజయాలు టీమిండియా ప్రతిష్ఠను దెబ్బతీశాయి. వరుసగా మూడు వైఫల్యాల అనంతరం, 2015లో జరిగిన టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌ను రెండుసార్లు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియాతోపాటు రికార్డును పంచుకుంటున్నది.
ఆస్ట్రేలియా రెండు పర్యాయాలు (1998, 2000) క్వార్టర్ ఫైనల్‌కు పరిమితంకాగా, మరో రెండుసార్లు (2002, 2004) సెమీస్ నుంచి వెనుదిరిగింది. ఒక్కో మెట్టు ఎక్కుతున్న చందంగా మొదటి రెండు పర్యాయాలు క్వార్టర్ ఫైనల్స్, ఆతర్వాత రెండుసార్లు సెమీ ఫైనల్స్ చేరిన ఆసీస్ రెండు పర్యాయాలు (2006, 2009) టైటిల్ సాధించింది. కానీ, హఠాత్తుగా ఫామ్‌ను కోల్పోయి, 2013లో మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించింది. న్యూజిలాండ్ (2000), దక్షిణాఫ్రికా (1998), శ్రీలంక (2002), వెస్టిండీస్ (2004) ఒక్కోసారి టైటిల్ సాధించాయి. 2002లో ఫైనల్ వర్షం కారణంగా రద్దుకావడంతో, భారత్, శ్రీలంక జట్లను సంయుక్త విజేతగాలు ప్రకటించారు. మొదటి చాంపియన్స్ ట్రోఫీలో తొమ్మిది, రెండోసారి 11, ఆతర్వాత వరుసగా రెండుసార్లు 12 చొప్పున జట్లు పోటీపడ్డాయి. 2006లో పది జట్లు బరిలోకి దిగాయి. ఆతర్వాత జట్ల సంఖ్యను ఎనిమిదికి పరిమితం చేశాయి. ఇప్పటి వరకూ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న జట్లలో చాంపియన్స్ భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, కెన్యా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, అమెరికా, జింబాబ్వే ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఈ టోర్నమెంట్ మొదలైనప్పటికీ నుంచి క్రమం తప్పకుండా హాజరవుతున్నాయి. వెస్టిండీస్ ఏడుసార్లు టోర్నమెంట్‌లో ఆడింది. ఈసారి అర్హత సంపాదించలేకపోయింది. బంగ్లాదేశ్, జింబాబ్వే చెరి ఐదుసార్లు, కెన్యా మూడు పర్యాయాలు, నెదర్లాండ్స్, అమెరికా ఒక్కోసారి చొప్పున చాంపియన్స్ ట్రోఫీలో ఆడాయి. 2004, 2014 సంవత్సరాల్లో రెండుసార్లు ఫైనల్ చేరిప్పటికీ టైటిల్ సాధించలేక పోయిన ఇంగ్లాండ్ ఈసారి హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నది. పాకిస్తాన్ మూడుసార్లు (2000, 2004, 2009) సెమీ ఫైనల్స్ చేరింది. చాలాకాలంగా ఫామ్‌లో లేని పాక్ ఎప్పుడు, ఏ విధంగా ఆడుతుందో? ఎప్పుడు విఫలమవుతుందో చెప్పలేని పరిస్థితి.
ప్రత్యేకతలు ఎన్నో!
చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ప్రపంచ కప్ మాదిరి ఈ టోర్నీలో ఎక్కువ జట్లకు అవకాశం ఉండదు. వరల్డ్ కప్‌లో కనీస సంఖ్యను కొనసాగించడానికి సత్తాలేని జట్లకు కూడా అర్హత కల్పిస్తారు. అందుకే, చాలా మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగుతాయి. కానీ, ‘మినీ వరల్డ్ కప్’ చాంపియన్స్ ట్రోఫీలో అర్హత పొందిన జట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఎనిమిది ప్రపంచ మేటి జట్ల మధ్య పోరు కొనసాగుతుంది. కాబట్టి ప్రతి మ్యాచ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ టోర్నమెంట్ సమయంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కనిపిస్తారు. ఈ టోర్నమెంట్ మ్యాచ్‌ల ఆరంభానికి మూడు రోజుల ముందే సందడి మొదలవుతుంది. మొదటి మ్యాచ్‌కి మూడు గంటల సమయం ఉండగానే ప్రత్యక్ష ప్రసారం ఆరంభమవుతుంది. ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ విధంగా ముందుగానే ప్రసారాలను మొదలుపెడతారనుకుంటే పొరపాటే. నిజానికి శ్రీలంక జాతీయ గీతాన్ని వినిపించడానికే నిర్వాహకులు ఇంత కష్టపడతారు. సహజంగా వివిధ టోర్నీలు, సిరీస్‌ల సమయంలో వినిపించే లంక జాతీయ గీతం చాలా సంక్షిప్తంగా ఉంటుంది. నిజానికి లంక జాతీయ గీతాన్ని పూర్తిగా వినాలంటే, నాలుగు గంటల సమయం వెచ్చించక తప్పదు. అందుకే, ప్రత్యక్ష ప్రసారాలకు మ్యాచ్ కంటే చాలా ముందుగానే తెరతీస్తారు.
ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ కంటే భిన్నంగా, ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటే చాంపియన్స్ ట్రోఫీకి అన్ని దేశాల్లోనూ విపరీతమైన ఆదరణ ఉంది. దీనివల్ల వరల్డ్ కప్ ఆదరణ కోల్పోతున్నదని వాదిస్తున్న కొంత మంది చాంపియన్స్ ట్రోఫీని రద్దు చేయాలని వాదిస్తున్నారు. వరల్డ్ కప్ ముగిసిన రెండేళ్ల తర్వాత ‘మినీ వరల్డ్ కప్’ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం వల్ల లాభం లేదని వారి అభిప్రాయం. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కూడా ఒకానొక దశలో ఈ వాదనకు సానుకూలంగా స్పందించింది. చాంపియన్స్ ట్రోఫీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దాని స్థానంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌ను నిర్వహించాలని తీర్మానించింది. కానీ, టెస్టు చాంపియన్‌షిప్‌కు సభ్య దేశాల నుంచి సరైన స్పందన లేకపోవడంతో, ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా విరమించుకుంది. రద్దయిందనుకున్న చాంపియన్స్ ట్రోఫీ మళ్లీ మన కళ్ల ముందు సరికొత్త దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించనుంది. వచ్చేనెల 1న మొదలై, 18తో ముగిసే ఈ టోర్నీ అందించే క్రికెట్ విందు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8 మేటి జట్లు ఢీ కొంటాయి కాబ ట్టి, ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్‌ను తలపించడం ఖాయం. హోరాహోరీ పోరాటాలతో స్టేడియాలు హోరెత్తనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా టైటిల్ నిలబెట్టుకుంటుందా? లేక విఫలమవుతుందా? అన్నది పక్కన ఉంచితే, ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ క్రికెట్ ప్రియులను ఉర్రూతలూగించి, క్రికెట్ మజాను ప్రేక్షకులకు అందిస్తుంది.

చిత్రం..2013 చాంపియన్స్ ట్రోఫీని సాధించిన భారత జట్టు. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది

- బివిఎల్‌కె మనోహర్