మెయిన్ ఫీచర్

యాజ్ఞసేని 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్యగానే చాలా కాలం వున్నది. కొంతకాలానికి తనకు వివాహం కావడంలేదని పరమశివుని గురించి భయంకరమైన తపస్సు చేస్తుండగా ఆమె వద్దకు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు వచ్చి జన్మాంతరంలో తమ తమ అంశాలతో జన్మించేవారికి భార్య కావాలాని కోరుకుంటారు. ఆమె తపస్సుకుమెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా ‘‘నాకు పతిదానం ఇమ్ము’’ అని ఐదుసార్లు అంటుంది. ఈశ్వరుడు కరుణించి నీకు వేరొక జన్మలో అయిదుగురు భర్తలౌతారు అని వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకు ఆమె అంతమంది భర్తలను పొందటం లోకవిరుద్ధముగావున ఇష్టం లేదంటుంది. ఆ మాటలకు పరమశివుడు..
‘‘ఓ కన్యా! నా మాట ప్రకారం నీకు ఐదుగురు భర్తలలో ధర్మం తప్పకుండా వుంటుంది. ఐదుగురు భర్తలలో ఒక్కొక్కరితో కలయిక వుప్పటికీ కన్యాత్వం, పతిసేవా భాగ్యం, కామాన్ని అనుభవించే కోరిక, ముతె్తైదుతనం కలుగుతుంది’’ అని చెప్పి అంతర్థానమయ్యాడు.
ఆమే ఇప్పుడు ద్రౌపదిగా పుట్టింది ద్రుపద మహారాజా! ఆ కనే్య ఈ జన్మలో నీకు కుమార్తె అయింది. అయిదుగురు వీరులకు పత్నిగా పూర్వమే నిర్ణయమైనది. ఈ స్వర్గలక్ష్మ న యజ్ఞశాలలో పాండవులకు పత్నిగా జన్మించింది. ఆమె ఘోరమైన తపస్సు చేసి నీకు కుమార్తె అయింది. బ్రహ్మయే ఈమెను దేవపత్నిగా చేయ తలపెట్టాడు. ఇది గ్రహించుము’’ అని అన్నాడు మహర్షి.
‘‘మహర్షీ! మీరు చెప్పిన విధంగానే పాండవులు ఈమెను గ్రహిస్తారు’’ అని అన్నాడు ద్రుపదుడు.
20
వివాహవేదిక
ద్రుపద మహారాజు భవనం ఉత్తమ పురుషులతో ప్రకాశిస్తున్నది.
వివాహ మహోత్సవం చూడవచ్చిన పెక్కుమంది రాజులతో, బ్రాహ్మణులతో రాజభవనం శోభిల్లుచున్నది.
రాజభవనం నిర్మల నక్షత్రాలలో వెలిగే ఆకాశంవలె వున్నది.
ఈశాన్య దిక్కున కళ్యాణ మంటపం-
బంగారు వివాహ వేదిక రంగు రంగు వస్త్రాలతో నిర్మింపబడివిశాలమైన కట్లనుండి మనోహరంగా ముత్యాల పూలదండలు వ్రేలాడదీయబడ్డాయి. స్తంభములన్నీ చక్కని పట్టువస్త్రాలతో చుట్టబడ్డాయి.
బియ్యపు అక్షతలు, క్రొత్త చివుళ్ళతో బంగారు పూర్ణకలశాలు ఒప్పుచున్నాయి.
బంగారు పాత్రలు పుణ్యజలాలతో, నేతితో నింపబడ్డాయి.
క్రొత్తవాసనలతో కూడిన పెక్కు విధాలైన పువ్వులతో, సమిథలతో, దర్భలతో, యజ్ఞపాత్రలతో నింపబడి మరకతమణుల కాంతిలో అలుకబడినట్లుగా వివాహ వేదిక ప్రకాశిస్తున్నది.
పచ్చకర్పూరాల, ముత్యల సమూహాలతో చక్కగా ముగ్గులు వేయబడ్డాయి. భవన ప్రాంగణం కలువలతో, పద్మాలతో వెలిగిపోతున్నది.
మంగళాకారాలుగల వేశ్యలు, దాసీజనం, వివాహమహోత్సవం కొరకు అలంకరించుకొని నియమింపబడిన కార్యక్రమాలలో నిమగ్నులైనారు.
అక్కడక్కడా యువకులు, అలంకృతులు, స్నానాలు చేసి విలువైన పట్టువస్త్రాలు ధరించి మంగళ క్రియలు ఆచరిస్తున్నారు.
చతురంగ సేనలు చిత్రంగా అమరి వున్నాయి.
పాండవులు కూడా మంగళ స్నానాలు చేసి, పట్టు పీతాంబరాలు ధరించి తమ పురోహితుడైన ధౌమ్యునితో కలిసి శాస్త్రోక్తంగా సదస్సులో ప్రకాశిస్తున్నారు.
నిండు చంద్రుని ముఖం గలది, మిక్కిలి నేర్పుగల ముతె్తైదువులచేత అలంకరింపబడిన అవయవాలుగలది, కమలాలవంటి కన్నులుగలది అయిన ‘యాజ్ఞసేని’ ద్రౌపది వేయిమంది అందమైన స్ర్తిలతో కలిసి వచ్చింది.
బ్రాహ్మణ శ్రేణుల పుణ్యాహధ్వని, మంగళగీతాల మధురధ్వని, పిల్లనగ్రోవుల, వీణల, వివిధ వాద్యాల ధ్వని మహాప్రభావంతో దిక్కులు పిక్కటిల్లాయి.
వేదవేదాంగ పారంగతుడు, విద్వాంసుడు, మంత్రజ్ఞుడు, పురోహితుడు అయిన ధౌమ్యుడు అగ్నిలో వ్రేల్చి, మంత్రాహుతులనిచ్చి, యుధిష్ఠిరుడిని పిలిచాడు
ద్రౌపదిని యుధిష్ఠిరుడు పాణిగ్రహణం చేశాడు. అగ్నికి ప్రదక్షిణ చేశారు. ధౌమ్యుడు వెళ్లిపోయాడు. ఆనాటి వివాహం ధర్మజునితో ముగిసింది.
మొదటిరోజు ద్రౌపది యుధిష్ఠిరుడు పాణిగ్రహణం చేశాడు. ఏకాంతంగా ఆ రోజు రాత్రి ద్రౌపది ధర్మరాజుతో కలిసింది. ఏకాంతంలో ద్రౌపది ధర్మరాజుతో అన్నది-
‘‘స్వామీ! న్యిసత్యవ్రతుడవు, ధర్మమూర్తివి అయిన మీకు ఈ ద్రుపద కన్య నమస్కరించుచున్నది. భార్యగా నాకు పవిత్రతను చేకూర్చి యశస్సును గడించుము’’ అని ముకుళితహస్తయై నిలబడింది.

- ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము