రివ్యూ

అంతా అబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారంటీ (బాగోలేదు)

తారాగణం:
మహదేవ్, ఐశ్వర్య, సిరిశ్రీ, పునర్నవి, దేవిప్రసాద్, హేమ, కాశీవిశ్వనాథ్ తదితరులు.
సంగీతం: వంశీ మారుతిరాజా
నిర్మాత:
పిఎస్ సూర్యతేజ రెడ్డి
దర్శకత్వం:
చందు ముద్దు

ప్రేమించటం అందరికీ వీజీ. నిలుపుకోవడమే కష్టం. ప్రేమతో జీవితాన్ని పండించుకోవడం కళ. ఆ కళలో విఫలమైన హీరో సూపర్‌హిట్‌లో కనిపిస్తాడు. పేరు చూసి ప్రేమించాలా? వద్దా? అని నిర్ణయించుకునే రకం. చిత్రమైన వ్యక్తిత్వంతో హీరోని హిట్టుగా చూపించే ప్రయత్నమే -ఈ సినిమా.
కథేంటి?
నాని (మహదేవ్)కి చిన్నప్పటి నుంచి ఇష్టమైన పేరు -శిరీష. ఆ పేరుతో ఎదురైన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడుతుంది. కొన్నాళ్లు ప్రేమికులిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. యథాప్రకారం వాళ్లిద్దరి విషయం ఇంట్లో తెలుస్తుంది. అమ్మాయి తరఫువాళ్లు చివాట్లుపెట్టి వేరే పెళ్లి చేసేస్తారు. అప్పుడు కూడా హీరో ఏమాత్రం ధైర్యాన్ని చూపించకుండా ‘నీ సుఖమే నే కోరుకున్నానంటూ’ తప్పుకుంటాడు. మళ్లీ కొన్నాళ్లకి అదే శిరీష పేరుతో మరో అమ్మాయి ఎదురవుతుంది. ఈసారి కూడా అలవాటుగా ఆమెతోనే ప్రేమలో పడతాడు. మళ్లీ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరుగుతారు. యథాప్రకారం మళ్లీ ఆ అమ్మాయి వాళ్లింట్లో వేరే పెళ్లి చేస్తారు. ఇక శిరీష అనే పేరు తనకు అచ్చిరాదని, వేరే అమ్మాయిని ప్రేమించాలని చెబుతారు అతని స్నేహ బృందం. ఓ చావు ఇంటికి వెళ్తే అక్కడ ఎదురవుతుంది మరో శిరీష. ఆ అమ్మాయిని చూస్తే ప్రేమించాలనిపిస్తుంది. కానీ, శిరీష అనే పేరు ఉంది కాబట్టి వద్దనుకుంటాడు. మూడో శిరీష కూడా నానితో ప్రేమలో పడుతుంది. మరి మూడో శిరీష అయినా మూడుముళ్లు వేయించుకుంటుందా? లేదా? అనేది మిగతా కథనం. చివర్లో గుప్త నిధుల కోసం మూడో శిరీషను బలి ఇవ్వడానికి ప్రయత్నించే క్లైమాక్స్ సన్నివేశాలు అదనంగా మనల్ని అలరిస్తాయి.
ఎలా వుంది?
సినిమా మొదటి నుంచి చూడటానికి ఆహ్లాదంగానే ఉంటుంది -ఏమీ ఆలోచించకుండా ఉంటే?. కథానాయకుడు బస్సులో తన ప్రేమకథలు చెప్పడం, మధ్యలో సీరియల్ ఆపేసినట్టు ఆపేసి బస్టాప్‌రాగానే దిగిపోవడం, తర్వాతి రోజు అతను ఎప్పుడు బస్సు ఎక్కుతాడా? మిగతా కథ విందామని ఎదురుచూసే అమాయకపు బస్ ప్రయాణికులు ఎలా ఉంటారో? ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. దానికితోడు ట్విస్టులు! విలన్ కొడుక్కి అతను కిడ్నాప్ అవుతున్నాడన్న సంగతి తెలియకుండానే కిడ్నాప్ చేసి, అతని ద్వారానే మూడో శిరీషను విడుదల చేయడానికి విలన్ తండ్రికి ఫోన్ చేయించిన ట్విస్టులు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. మొదటినుండి హీరో స్నేహబృందం వేసే పంచ్ డైలాగులే కొద్దోగొప్పో సినిమాకు అదనపు ఆకర్షణ. దర్శకుడు కథ రాసుకున్న విధానంలో చాలా సొంత అనుభవాలు కూడా జోడించినట్టు అనిపిస్తుంది. ప్రేమికుడు ఎన్ని అబద్దాలు చెప్పొచ్చో అన్ని అబద్దాలు చెప్పినట్టుగా దర్శకుడు కూడా ప్రేక్షకుడికి ‘హిమాలయపు పువ్వు’లను చెవిలో పెట్టేశాడు. ఇన్నిసార్లు ప్రేమించావు కదా, మొనాటనీ రాలేదురా? అని హీరో స్నేహితుడు అడుగుతాడు. అది మనల్ని అడగాల్సింది. బంధువుల చావులను అడ్డంపెట్టుకుని ప్రేమికులిద్దరూ కలుసుకోవడం అనేది చాలా కొత్తపాయింటే. దాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు.
అపరిచితుడు చిత్రంలో రామానుజం ప్రేమికురాలికి సర్ట్ఫికెట్లతో లవ్‌లెటర్ రాసినట్టుగా, ఇందులో కూడా హీరో ఆధార్ కార్డు, వోటర్ ఐడి, రేషన్‌కార్డు అన్నీ చూపించి లవ్ చేయమంటాడు. ఎంత స్టాటికల్ లవ్వోకదా? అమ్మాయిలు పొలిటీషియన్ లాంటి వాళ్లు. వాళ్లు పార్టీలు మార్చినట్టు ప్రేమికుల్నీ మార్చేస్తారట అని అంటే, ఎదవ ఫిలాసఫీలు చెప్పొద్దంటాడు కథానాయకుడు. ఈ ఎదవ ఫిలాసఫీలు ఫేస్‌బుక్‌లో పెట్టడానికి బావుంటాయి కానీ, నీ ఫేస్‌కు సెట్‌కావంటాడు. పెద్దమనిషి తన కూతురు పెద్దమనిషైనప్పటి నుంచి పెద్దమనిషిలాంటి పెళ్లికొడుకుని వెదికే పనిలో పడతాడట! ఎంత క్లారిటీ! చిన్నీ.. అని పిలిస్తే అదే రాగంలో మూడో శిరీష పిన్నీ.. అంటూ గారాబంగా వెళ్లడం ‘్భలే’ ఉంటుంది.
సాంకేతికంగా కెమెరా పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. సంగీతపరంగా ఇళయరాజా మార్కును వంశీ, మారుతిరాజా కాపీ చేయడానికి ప్రయత్నించినా కొంతలోకొంత విజయం సాధించారు. ముఖ్యంగా ‘కోటి తారలపై, వౌనమా’ పాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ చాలా చేయొచ్చు. నటీనటుల్లో మహదేవ్ పరవాలేదనిపించాడు. హీరోయిన్లుగా చేసినవాళ్లు కొద్దోగొప్పో అందంవున్నా, నటన ఏమాత్రం లేకుండా తేలిపోయారు. మూఢ నమ్మకం డ్రగ్ లాంటిదే! లవ్‌కన్నా లివర్ ముఖ్యం వంటి సంభాషణలు ఫరవాలేదు. దర్శకత్వపరంగా చాలా హోమ్‌వర్క్ చేశాడుకానీ, అది తెరపై పండించటంలో తడబడ్డాడు. నెక్స్ట్‌టైమ్ బెటల్ లక్!

-శేఖర్