హైదరాబాద్

క్రమబద్ధీకరణ దరఖాస్తులపై ఏసిబి నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సర్కిళ్ల వారీగా దరఖాస్తుల వివరాల సేకరణ
హైదరాబాద్, మార్చి 13: మహానగరంలో మున్సిపల్ అనుమతుల్లేకుండా, ఒక వేళ ఉన్నా, వాటిని అతిక్రమించి నిర్మించిన నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఈసారి కాస్త క్షుణ్ణంగా జరగనుంది. ఇప్పటికే అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించాలా? లేదా? అన్న అంశంపై త్వరలోనే కోర్టు తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. మరోవైపు క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఏ మాత్రం అవినీతికి, దళారులకు తావులేకుండా, అవినీతికి అడ్డుకట వేయాలని ఇప్పటికే మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటిఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయటంతో రంగంలో దిగిన అధికారులు క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాలను తనిఖీ చేసిన ఏసిబి అధికారులు ప్రస్తుతం క్రమబద్ధీకరణ కోసం సర్కిళ్ల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్యను సేకరిస్తున్నారు. ఈ రకంగా సేకరించిన దరఖాస్తుల వివరాలను బట్టి ఏసిబి అధికారులు ఒక్కోసర్కిల్‌లో ఆకస్మికంగా పలు దరఖాస్తులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని సర్కిళ్లలో ప్రభుత్వం నిర్ణయించిన అక్టోబర్ 28 కటాఫ్ తేదీ కన్నా ముందు నిర్మాణాలు బయటపడుతున్నాయి. ఇలాంటి నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమబద్ధీకరించేది లేదని ఏసిబి అధికారులు జిహెచ్‌ఎంసికి సూచిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల్లేకపోయినా, అదనపు అంతస్తులున్నట్లు డాక్యుమెంట్లు, ప్లాన్లు సృష్టించి క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు కూడా బయట పడ్డాయి. ఇలాంటి తతంగాల్లో కొందరు జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారుల ప్రమేయమున్నట్లు కూడా ఏసిబి గుర్తించింది. ఇందుకు సంబంధించి నివేదికను త్వరలోనే సర్కారుకు, మున్సిపల్ మంత్రికి ఏసిబి నివేదికనివ్వనున్నట్లు తెలిసింది. ఈ రకంగా వచ్చిన పలు రకాల నివేదికలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్‌ను ప్రక్షాళన చేయాలని సర్కారు యోచిస్తోంది.
క్షుణ్ణమైన తనిఖీలతో లాభం ఎవరికి?
క్రమబద్ధీకరణలో ఎలాంటి అవినీతి, దళారులకు తావులేకుండా పారదర్శకంగా జరగాలన్న సంకల్పంతో సర్కారు ఏసిబి అధికారులను క్రమబద్ధీకరణలో భాగస్వాములను చేయటం ఎవరికి లాభం అన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో క్రమబద్థీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కేవలం జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రమే క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించి దరఖాస్తులకు క్లియరెన్స్ ఇచ్చేవారు. కానీ ఇపుడు ఏసిబి అధికారులు కూడా ఎపుడు ఏ దరఖాస్తు తాలుకు భవనాలను తనిఖీ చేస్తారన్నది అయోమయంగా మారింది. దీన్ని ఒక రకంగా జిహెచ్‌ఎంసి అధికారులు సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏసిబి అధికారులను బూచిగా చూపి దరఖాస్తు దారుల నుంచి ఎక్కువ మొత్తంలో దండుకునేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు ఇప్పటి నుంచే స్కెచ్‌లు వేస్తున్నట్లు సమాచారం.