ఆంధ్రప్రదేశ్‌

సిఆర్‌డిఎ అధికారి ఆస్తులపై ఎసిబి ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ)లో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న రెహమాన్ ఆస్తులపై ఎసిబి అధికారులు మంగళవారం ఉదయం సోదాలు చేస్తున్నారు. మొత్తం 11 ప్రాంతాల్లో ఆయనకు 1.6 కోట్ల ఆస్తులున్నట్లు ప్రాథమిక సమాచారం. రెహమాన్ నుంచి 4 లక్షల నగదుతో పాటు కొంత విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన గతంలో విశాఖతో పాటు పలు చోట్ల పనిచేసి అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఇటీవలే ఆయన విశాఖ నుంచి సిఆర్‌డిఎలో చేరారు.