జాతీయ వార్తలు

అలనాటి బాలీవుడ్ నటి సాధన ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రెండు దశాబ్దాల పాటు హీరోయిన్‌గా ఉర్రూతలూగించిన అలనాటి బాలీవుడ్ నటి సాధన (74) అనారోగ్యంతో బాధ పడుతూ శుక్రవారం ఇక్కడ కన్నుమూశారు. ఆమె నటించిన పలు సినిమాలు కాసులవర్షం కురిపించాయి. 1941లో ఆమె పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించారు. దేశ విభజన తర్వాత ఆమె కుటుంబం ముంబయిలో స్థిరపడింది. ‘శ్రీ 420’తో సినీరంగ ప్రవేశం చేశాక ఆమె పలువురు అగ్రహీరోలతో పోటాపోటీగా నటించి అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె మృతి పట్ల బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.