ఆంధ్రప్రదేశ్‌

రేపు టిడిపిలో చేరనున్న గాదె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టిడిపిలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఇక్కడ స్వయంగా గాదె ప్రకటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న దీక్షతో ముందుకు వెళుతున్న చంద్రబాబు నాయకత్వంలో తాను పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో శుక్రవారం ఉదయం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరేందుకు ఆయన ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు.