అదిలాబాద్

అనుమతి తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ రూరల్,అక్టోబర్ 25: జిల్లాలో టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసే వ్యాపారస్తులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, లేనట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మిట్ట శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లాలో టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసే వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీపావళి పండగ సంధర్భంగా పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీగా టపాసుల దుకాణాలు వెలుస్తుండడం, సరైన జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భారీ అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో ముందస్తుగా ఎస్పీ పలు సూచనలు చేశారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ టపాసుల వ్యాపారం చేసేవారు ముందుగా నిబంధనల ప్రకారం లైసెన్స్ తీసుకొని ప్రమాదాల నివారణపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం టపాసుల విక్రయదుకాణాల వద్ద మొదటిసారిగా అగ్నిమాపక శాఖ సౌజన్యంతో మిన్ట్‌బుల్లెట్ వాహనంను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నివాస గృహాలకు దూరంగా, విశాలమైన ప్రదేశాలలో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చిన్న పిల్లలను టపాసుల దుకాణాల్లో అనుమతించరాదని అన్నారు. అకస్మిక తనిఖీలు నిర్వహించూ సమయంలో నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టరిత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అగ్నిమాపక అధికారుల సూచనమేరకు ముందస్తుజాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరిగిన అత్యవసర ఫోన్ నెంబర్లు 100, 101కు ఫోన్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డిఎస్పీలు ఎస్.మల్లారెడ్డి, ఏలక్ష్మీనారాయణ, తహసీల్దార్ టి.వర్ణ, డివిజనల్ ఫైర్ అధికారి సందన్న, సిఐలు ఎన్.సత్యానారాయణ, పోతారం శ్రీనివాస్, జయరాం బిఎల్‌ఎన్ స్వామి, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హఖ్, తిరుపతి, టపాసుల వ్యాపారస్తులు పాల్గొన్నారు.