మహబూబ్‌నగర్

రైతులను మోసం చేస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, నవంబర్ 2: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తన మాటల గారడితో రైతులను మోసం చేయడం తప్పా వారిని ఏనాడు ఆధుకున్న పాపాన పోలేదని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి తల్లోజి ఆచారి ఎద్దేవ చేశారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కొండయ్య ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై మహాధర్న కార్యక్రంలో భాగంగా స్థానిక తహశీల్దార్ కా ర్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి టి.అచారీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కొండయ్యలు మాట్లాడారు. ఇన్‌పుట్ సబ్సిడి రుణమాఫిలో కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని తెలిపా రు. ఎన్నికల ముందు రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫి చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, పేదలకు డబుల్ బెడ్‌రూములు కట్టిస్తామని తెగ డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల్లో గెలిచాక రైతుల రుణమాఫీ విషయం దేవుడెరుగుకానీ ఉన్న కొద్ది పాటి వ్యవసాయాన్ని వదిలి చెప్పులు అరిగే విదంగా బ్యాంకుల చుట్టు తిప్పుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సొమ్మొకరిది, సోకొకరిది అన్న విదంగా సొమ్ము కేంద్రానిది, సోకు కెసిఆర్ ప్రభుత్వానిది అన్న విదంగా పరిపాలన కొనసాగుతుందని అన్నారు. వర్షాభావ పరిస్థిల కారణంగా రైతులను ఆధుకోవాలన్న తలంపుతో తమ ప్రధానమంత్రి నరేంద్రమోది రూ.790 కోట్లను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చి వాటికి మరో రూ.300 కోట్లు కలిపి దాదాపు రూ.11వేల కోట్లను రైతులకు చెల్లించమని ఇచ్చారని అన్నారు. కాగా కెసిఆర్ కేంద్రం ఇచ్చిన డబ్బులను రాష్ట్ర ఖాతాలో జమచేసుకొని రైతులను తీవ్ర మోసం చేసిందని వారు మండి పడ్డారు. ముఖ్యమంత్రి చం ద్రశేఖర్‌రావుపేదలకు డబుల్ బెడ్‌రూము ఇళ్లు రావు, అల్లుడు హరీష్‌రావుమాపొలాలకు నీళ్లు రావు, కొడుకు తారకరామారావు మాకు ఉద్యోగాలు రావు, కూతురు కవితరావు మాకు బతుకమ్మ పండుగ నిధులు రావు, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మా గ్రామపంచాయతీకలు నిధులు రావు ఇలా వారి పేర్లల్లోనే రావురావు అ ని వుంటే ఎక్కడి నుండి వస్తాయని వారు ఎద్దేవ చేశారు. వారి నుండి రావు అన్న పదాన్ని తిరగరాస్తూ కమలం జెండ చేతపట్టి ఇలాంటి ఉధ్యమాలు, ధర్నాలు చేస్తే ప్రజల బాధలు తీరిస్తే అన్ని మనముంగిటకు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో వెంటనే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులనన్నింటిని పూర్తిచేసి రైతులకు సాగు, తాగు నీటిని అందించాలని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్రమోది వెంటనే రూ.13వేల కోట్లను విడుదల చేయడం జరిగిందనిఅన్నారు. కానీ గడచిన రెండున్నర సంవత్సరాల కాలంలో ఒక్క కాలువను నిర్మించకుండా ఉన్న కాలువలలోని గడ్డిని తొలగించి కాలువలకు నీటి వదలడం తప్పా ఏరైతు చెలకైనా తడిచిందా అంటూ వారు కెసిఆర్‌ను ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న పనులు గాలికొదలి మంత్రి హరీష్‌రావు ఆగమేగాలమీద వచ్చి లిప్టులను ప్రారంభించి పోతే ఆనీరు కాలువల ద్వారా మళ్లీ నదిలోకి వె ళ్లడం తప్పా రె తుల పొలాలకు వెళ్లడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుండి రూ. 29లు చెల్లించి సన్న బియ్యాన్ని కొలుగోలు చేసి పంపుతున్న నరేంద్రమోది రాష్ట్ర ప్రభుత్వం వాటా ద్వారా రూ.2, ప్రజల నుండి ఒక్క రూపాయను తీసుకొని ఇస్తుంటే మొత్తం తానే ఇస్తున్నట్లు ఈప్రభుత్వం చెప్పుక రావడం ఇంత కన్న సిగ్గుచేటు లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనులు కలసి తెలంగాణను సాధించుకున్నప్పటికి ఉద్యమం చేసిన వానిని వదలి ఉద్దెర వాళ్లకు పదవు కట్టబెట్టం ఎంత వరకు సమంజసమని మండి పడ్డారు. డబుల్ బెడ్ రూములకై కేంద్రం రూ. 91వేల కోట్లు చెల్లిస్తే ఈపేద ప్రజలకు ఒక్క ఇల్లయినా కట్టిచ్చాడా అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలు తన ఖాతాలో బ్యాంకుల్లో జమ చేసుకొన్న కెసిఆర్ దగాకోరు, జూటాకోరు, అబద్దాలకోరు కాదాఅని అన్నారు. గత 6నెలల నుండి ఉపాధి పథకంలో పనిచేసే కూలీలకు కూలి డ బ్బులులేవు, గ్రామపంచాయతి సిబ్బందికి వేతనాలు లేవు, హోంగార్డుల పర్మనెంట్ లేదు ఇ దేనా కెసిఆర్ గారడి ప్రభుత్వమని వారు మండి పడ్డారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు భాగుపడలేదని, ఈవాళ్ల రైతులేడ్చిన నీప్రభుత్వం ఏనాడు భాగుడదని ఆయన అన్నారు.
నేడు మక్తల్ రైతులు కెసిఆర్‌కు కనువిప్పు కలిగించే కార్యక్రమం తీసుకోవడం ఎంతో అభినందించ వలసిన విషయమని ఆయన అన్నారు. అంతకు ముందు స్థానిక నల్లజానమ్మ దేవాలయం నుండి పట్టణ పురవీధులగుండా తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించా రు. బిజెపి నాయకులు భాస్కర్, సోమశేఖర్, కర్నిస్వామి, కుర్వ హన్మంతు, బాల్జేడ్ మల్లిఖార్జున్, విద్యాసాగర్, కోళ్ల వెంకటేష్ పాల్గొన్నారు.

కెఎల్‌ఐ కాల్వ పనులను పూర్తి చేయాలి
గోపాల్‌పేట, నవంబర్2: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించే డిస్టిబ్యూటరీ కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ శే్వతా మహంతి అధికారులను ఆదేశించారు. బుధవారం గోపాల్‌పేట మండలానికి సాగునీరు అందించే డిస్టిబ్యూటరీ కాల్వను పనులను ఆమె పరిశీలించారు. రామిరెడ్డితండా దగ్గర ఉన్న కెఎల్‌ఐ డిస్టిబ్యూటరీ కాల్వ పనులను ఆమె పరిశీలిస్తూ అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులను పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాల్వ పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకొని వీలైనంత త్వరగా కాల్వ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కాల్వ దగ్గరకు వచ్చారని విషయం తెలుసుకున్న చాకల్‌పల్లి, గోపాల్‌పేట, పొల్కెపహాడ్, కేశంపేట గ్రామాల రైతులు అక్కడికి చేరుకున్నారు. రైతులు కాల్వలకు గండి కొట్టవద్దని అన్ని గ్రామాల చెరువులకు సాగునీరు వస్తుందని అన్నారు. కలెక్టర్ వెంట గోపాల్‌పేట తహశీల్ధార్ యేసయ్య, ఇరిగేషన్ డిఇ లోకిలాల్, అధికారులు, పలు గ్రామాల రైతులు, నాయకులు సత్యశీలారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

‘పేట’లో ఆగ్రహ జ్వాలలు
నారాయణపేటటౌన్, నవంబర్ 2: నారాయణపేట జిల్లా ఏర్పాటుపై ఎంపి జితేందర్‌రెడ్డి జిల్లాకేంద్రంలో చేసిన వాఖ్యలు నారాయణపేట డివిజన్ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఇకపై జిల్లాల ఏర్పాటు లేదని, అభివృద్ది పథంలో ముందుకు సాగాలని సూచించిన నేపథ్యంలో తమకు ఇచ్చిన మాటను తప్పుతారా అంటూ నారాయణపేట డివిజన్‌లో ఎంపి జితేందర్‌పై ప్రజలు, యువత, విద్యార్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంపి జితేందర్‌రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించి స్థానిక సత్యనారాయణ చౌరస్తాలో దగ్దం చేశారు. జిల్లా ఏర్పాటు కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలను చైతన్యవంతులను చేసేందు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన బైక్ ర్యాలీ నారాయణపేట నుండి దామర్‌గిద్ద మండలం, మద్దూరు, కొడంగల్ మీదుగా దౌల్తాబాద్‌కు చేరుకుంది. ఈ ర్యాలీని జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మనోహర్‌గౌడ్ ప్రారంబించగా పెద్ద సంఖ్యలో జిల్లా సాధన సమితి సభ్యులు, యువకులు పాల్గొన్నారు. కాగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపి జితేందర్‌రెడ్డి చేసిన ప్రకటన ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసి తీరాలని డిమాండ్ చేశారు. నారాయణపేట మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపిపి, ఎంపిటిసి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని జై నారాయణపేట జిల్లా అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్‌కు వినతిపత్రం సమర్పించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపిపి మణెమ్మ, పిఎసిఎస్ అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, ఆయా సంఘాల నాయకులు కాశీనాథ్, యాదగిరి, పళ్ల ర ఘు, గోపికృష్ణలు మాట్లాడుతూ నారాయణపేట జి ల్లా ఏర్పాటుకు సంబందించి సిఎం కెసిఆర్‌తో జిల్లా సాధన సమితి సభ్యులను కలిపి సమస్యను సానుకూలంగా పరిష్కరించి జిల్లా ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పిన ఎంపి జితేందర్‌రెడ్డి, మంత్రి లక్ష్మారెడ్డి తీరా చేతులెత్తేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ ఎంపిగా కెసిఆర్ గెలుపుకు కృషి చేసిన నారాయణపేట డివిజన్ ప్రజలు రెండు మార్లు పాలమూరు నుండి పోటీ చేసిన ఎంపి జితేందర్‌రెడ్డికి పట్టం క ట్టారని ఆ విషయాన్ని సిఎం కెసిఆర్‌తో పాటు ఎంపి విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాలమూరు ఎంపిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కెసిఆర్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించడం ఎంతవరకు సమంజసమన్నారు. కాగా తన స్వస్థలం ఆముదాలపాడు నడిగడ్డలో ఉన్న నేపథ్యంలో గద్వాల జిల్లాకు పట్టుబట్టిన ఎంపి జితేందర్ తనకు రాజకీయ యోగం కల్పించిన పాలమూరు జిల్లాలోని నారాయణపేట జిల్లా విషయంలో ఎందుకు సిఎంపై వత్తిడి తీసుకురాలేదని ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా ఏర్పాటయ్యే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉంటామని ఈ నెల 6నుండి తలపెట్టిన నిరవధిక బంద్ యథావిధిగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిటిసిలు, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలను విస్మరించిన కెసిఆర్
వనపర్తి, నవంబర్2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను విస్మరించి పేదలను పట్టించుకోవడం లేదని సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి యం.డి జబ్బార్ అన్నారు. బుధవారం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విదానాల వల్ల రైతులు తమ వ్యవసాయ వృత్తిని వదులుకొని ఇతర ఆధాయ వనరుల కోసం పట్టణాలకు చేరుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రభుత్వం పేద, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆయన అన్నారు. మహాజన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రజలను చైతన్యం చేసి ఫ్రభుత్వంపై ఒత్తిడి తె చ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టె విధంగా చూస్తామని ఆయన అన్నారు. దళితులకు మూ డు ఎకరాల భూమి ఇస్తామన్న కెసిఆర్ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్ట్టీ చట్టం చేసి ఇప్పటి నిబందనలను రూపొందించలేదన్నారు. దళితులపై దాడులు, వివక్ష కొనసాగుతుందన్నారు. సామాజిక న్యాయం జరగ డం లేదని ఆయన ఆరోపించారు. గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, వక్ఫ్ భూములను తిరిగి ఇప్పిస్తామని చెప్పిన కెసిఆర్ ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ఆయ న ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు మూడవ విడుతను విడుదల చేయలేదని దీంతో రైతులు ప్రయివేట్ అప్పులకు వెళ్లి రుణాలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోకపోవడం వల్ల వ్యవసాయం చేయలేని దుస్థితిలో రైతులు ఉన్నారని, వ్యవసాయం చేయలేక కుల వృత్తి అయిన వ్యవసాయాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరికి అన్నం పెట్టె రైతన్నకే అన్నం తినే్న స్థోమత కరువవుతుందని దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ద తీసుకొని రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, ఉద్యోగ భర్తీ జరగకపోవడంతో నిరుద్యోగులు పెరిగిపోతున్నారని, నిరుద్యోగ భృతిని ప్ర భుత్వం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం ఆటకెక్కిందని, ఏగ్రా మంలో ఇళ్ల నిర్మాణం జరగడం లేదని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్ధిష్ట వ్యవధి ప్రణాళికలు లేవని, అవినీతి చోటు చేసుకుందని ఆ యన అన్నారు. సమాగ్రాభివృద్ధి జరిగినప్పుడే ముఖ్యమంత్రి అనుకుంటున్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను తెలుసుకొని చైతన్యం చేసేందు కు సిపిఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 17 నుండి వచ్చే ఏడాది మార్చి 12వ తేది వరకు మహాజన పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వనపర్తి జిల్లాలో 6, 7,8 తేదిల్లో నిర్వహిస్తున్నామని పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధ్దికి కృషి
వెల్దండ, నవంబర్ 2: గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి శాయశక్తుల కృషి చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి తెలిపారు. చారకొండ మండలం గోకారం గ్రామంలో 2 లక్షల 50 వేల రూపాయాలతో చేపట్టే రోడ్డు మరమ్మత్తు పనులకు ఎమ్మెల్యే బుధవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వౌళిక సదుపాయాలు కల్పిస్తూ గ్రామాల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను ప్రాదాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో రోడ్లు, వీదిలైటు, అంతర్గత రహాదారులు, తాగునీటి సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లక్ష్మమ్మ, డిసిసి అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌రెడ్డి,కాంగ్రెస్ నాయకులు పెద్దయ్యయాదవ్, బాలస్వామి,బాస్కర్‌రెడ్డి, పర్వత్‌రెడ్డి,బక్కయ్యగౌడ్, శేఖర్,వీరాచారి,కొండల్, శ్రీనివాస్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

అబివృద్ధిలో అగ్రగామిగా జడ్చర్ల
* మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోకెల్ల జడ్చర్ల నియోజకవర్గాన్ని అబివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.బుధవారం మండల పరిధిలోని పెద్ద ఆదిరాల గ్రామంలో పలు అబివృద్ధి పనులకు మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జడ్చర్ల అన్ని రంగాలల్లో అబివృద్ధి చెందుతుందని తెలిపారు.విధ్యా,వైధ్య,ఆరోగ్య,ఉద్యోగ,ఉపాధి రంగాలల్లో జడ్చర్ల ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవ గంలో అనేక అబివృద్ధి కార్యక్రమాలను యుద్దప్రాతిపదికన నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా చూడటమే తాన భాధ్యత అని, అందుకోసం అవిశ్రాంతంగా కృషి చేస్తానని అన్నారు. ఒకప్పుడు మారుమూల గ్రామాలకు రవాణా సదుపాయాలు సక్రమంగా లేక పోవడం వల్ల అబివృద్ధిలో వెనుకబడి పోయాయని,తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే నియోజకర్గంలోని గ్రామగ్రామానికి బిటి రోడ్డు సౌకర్యం కల్పించానని అందువల్ల గ్రామాలు త్వరితగతిన అబివృద్ధి చెందుతున్నాయని అన్నారు. మంత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన మిని వాటర్ ట్యాంక్‌ను ప్రా రంభించారు. అదేవిధంగా పిహెచ్‌సి ఎర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. సేవాలాల్ మహారాజ్ ఆలయంలో రేకుల షేడ్ నిర్మాణం కోసం ఎసిడిపి ద్వారా రూ.5లక్షలతో షేడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.