అదిలాబాద్

గత ప్రభుత్వాల విధానాలనే అవలంభిస్తున్న టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, డిసెంబర్ 5: ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలనే ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం అవలంభిస్తోందని సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాయిబాబా విమర్శించారు. సోమవారం నిర్మల్‌లోని టిఎన్జీవో సంఘ భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల మాదిరిగానే పెట్టుబడిదారులు, ధనిక కార్పోరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ టి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలను అమలుచేస్తోందని ఆరోపించారు. భౌగోళికంగా తెలంగాణ వచ్చినప్పటికి సామాజికంగా ఎలాంటి మార్పు జరగలేదన్నారు. 93 శాతం ఉన్న అట్టడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమాన్ని మరిచి ఉన్నత వర్గాలకు ప్రభుత్వాలు కొమ్ముకాస్తున్నాయన్నారు. దేశంలోనే రెండవ ధనిక రాష్టమ్రని గొప్పలు చెబుకుంటున్న టి ఆర్ ఎస్ ప్రభుత్వం నేటికి కనీస వేతనాన్ని కార్మికులకు కల్పించలేకపోతోందన్నారు. ధనికులకు మూడెకరాల భూమి హామీగానే ఉండిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో 3 లక్షల మంది దళిత నిరుపేద కుటుంబాలు ఉన్నాయని, వీరికి భూ పంపిణి కోసం 9 లక్షల ఎకరాల భూమి అవసరమన్నారు. రాష్టవ్య్రాప్తంగా 60 లక్షల ఎకరాల భూమి పంపకానికి అనువుగా ఉందని, ఇప్పటికైనా వెంటనే భూపంపిని చేపట్టాలన్నారు. ఆదివాసి గిరిజనులు సాగుచేస్తున్న భూములకు హక్కు పత్రాలు అందజేయాలని డిమాండ్‌చేశారు. 12 శాతం ఉన్న మైనార్టీలకు భద్రత కల్పించడంతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు వారికి రిజర్వేషన్లను కల్పించాలని కోరారు. పెరుగుతున్న జనాభా ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్‌చేశారు. ఉద్యోగులు, కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలను ఇవ్వాలని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.5 లక్షల పోస్టులను భర్తీచేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఇచ్చిన హామీలను మరిచిన ప్రభుత్వం దృష్టికి సమస్యలను తేవడంతోపాటు సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ది అనే నినాదంతో సిపి ఐ ఎం ఆధ్వర్యంలో మహాజన పాదయాత్రను చేపట్టామన్నారు. ఈ నెల 11న నిర్మల్ జిల్లాకు ఈ పాదయాత్ర చేరుకుంటుందని, దీనికి ముఖ్య అథితిగా సి ఐ టియు అఖిలభారత అధ్యక్షురాలు డాక్టర్ కె.హేమలత, ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సి ఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు డి.పోశెట్టి, ఎస్‌కె దాదేమియా, డివై ఎఫ్‌వై జిల్లా కన్వీనర్ బి.సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దుర్గం నూతన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.