అదిలాబాద్

ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామడ, డిసెంబర్ 27: ప్రతీ ఒక్కరు బ్యాంకులో ఖాతాను కలిగి ఉండాలని, నగదురహిత లావాదేవీల కోసం బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలంబరిది అన్నారు. మంగళవారం మండలంలోని పోతారం, పొన్కల్ గ్రామాల్లో నగదురహిత లావాదేవీలపై నిర్వహించిన అవగాహణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అథితిగాహాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదురహిత గ్రామాలుగా తీర్చిదిద్దితే సర్పంచ్‌లకు అవార్డులు ఇస్తామన్నారు. వ్యాపారస్తులు, కిరాణాదుకాణం, రేషన్, చిరువ్యాపారులు తప్పనిసరిగా స్వైపింగ్ మిషన్లను తీసుకోవాలని సూచించారు. అనంతరం పోతారంలోని కిరాణా దుకాణంలోవెళ్లి నగదురహిత లావాదేవీలు చేసుకోవాలని యజమానికి పలు సూచనలు ఇచ్చారు. 100 శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, మిషన్ భగీరథలో ప్రతీ ఇంటింటికి తాగునీటిని అందజేస్తామన్నారు. గ్రామాల్లో సమస్యలుంటే చదువుకున్న యువకులు ముందుకువచ్చి సమస్యలను పరిష్కరించి గ్రామ అభివృద్దికి తోడ్పడాలన్నారు. సదర్‌మాట్ మినీ బ్యారేజ్‌లో భూములు కోల్పోతున్నవారికి నష్టపరిహారం చెల్లించకుండానే కాంట్రాక్టర్ పనులు ఎలా చేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. త్వరలోనే భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. బ్యాంకుల వద్దకు భోజనం చేయకుండానే వచ్చి క్యూలైన్ కడుతున్నామని ఖాతాదారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 31 తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అన్ని బ్యాంకుల్లో నగదును అందుబాటులో ఉండేవిధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెసి శివలింగయ్య, సర్పంచ్‌లు రాజవ్వ, లస్మవ్వ, తహసిల్దార్ రామస్వామి, ఎంపిడివొ శేఖర్, ఈవొపి ఆర్‌డి కమలాకర్, వ్యవసాయాధికారి వసంత్‌రావు, ఆర్‌డబ్ల్యూ ఎస్ ఎ ఈ స్నేహజ్యోతి, ఆర్ ఐ చిన్నయ్య, ఎపి ఎం అరుణ, పంచాయతీ కార్యదర్శులు రవీందర్, సురేస్, వి ఆర్‌వొలు బద్దయ్య, మోహన్, నాయకులు హరీష్‌కుమార్, నవీన్‌రావు, రాజారెడ్డి, చిన్నయ్య, బొర్రన్న, అర్జున్, సిసిలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
బైంసారూరల్, డిసెంబర్ 27: తానూర్ మండలం మహాలింగి గ్రామానికి చెందిన ఉత్తూర్ శివ(40) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లికి చేసిన అప్పుతోపాటు పంటల్లో ఆశించినంత దిగుబడి రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలన్న దిగులుతో పంట పొలంలోనే పురుగుల మందు సేవించాడు. స్తానికులు గమనించి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై సురేష్ తెలిపారు.
సైబర్ నేరాలపై అప్రమత్తం
* వరంగల్ రేంజ్ డి ఐజి రవివర్మ
శ్రీరాంపూర్ రూరల్ డిసెంబర్ 27: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా మెలగాలని వరంగల్ రేంజ్ డి ఐజి రవివర్మ పేర్కొన్నారు. మంగళవారం సిసిసి నస్పూర్‌లోని సింగరేణి వసతి గృహంలో 5 జిల్లాల పోలీస్ అధికారుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల పోలీస్ అధికారులకు శిక్షణనిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాల సంఘటన దోషులను పట్టుకొని సి ఐడి విభాగానికి అప్పగిస్తున్నామన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల కొందరు అక్రమంగా నోట్ల మార్పిడి చేస్తున్న వారిని పట్టుకొని ఐటి శాఖకు అప్పగిస్తున్నామని జణమైత్రి పథకం ద్వారా ప్రతి గ్రామానికి పోలీస్ అధికారిని నియమించి ప్రజా సమస్యలను నేరుగా తెలుకొని పరిష్కరిస్తున్నామన్నారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఆపరేషన్ పునర్జన్మ ద్వారా రైల్వే స్టేషన్, బస్టాండ్, వీధుల్లో తిరిగే మానసిక రోగులు, బిచ్చగాళ్ళను చేరదీసి హైదరాబాద్‌లోని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నామని తెలిపారు. ఆశ్రమంలో వారికి అన్ని విధాల సౌకర్యాలను కల్పించి వారి బంధువులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ ముస్కాన్ పథకం ద్వారా అనాధ బాలలను, వృద్ధులను చేరదీస్తు ఆశ్రమంలో చేర్పిస్తున్నామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను అధికారులతో చర్చించి సత్వరమే పరిష్కారమైయ్యేల కృషి చేస్తామన్నారు. గుడుంబా, గుట్కాల అప్రమణ రవాణ తీవ్ర వాధుల సంఘటనపై పోలీస్ అధికారుతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పోలీస్ అధికారుల, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమీషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్, మంచిర్యాల డిసిపి జాన్‌వెస్లీ, ఆదిలాబాద్ డిసిపి శ్రీనివాస్, నిర్మల్ డిసిపి విష్ణ వారియర్, అసిఫాబాద్ డిసిపి రణప్రీత్ సింగ్, బెల్లంపెల్లి ఎసిపి సతీష్‌కుమార్, మంచిర్యాల ఎసిపి చిన్నయ్య ఇతర పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్ల సమ్మె

అందోళనలో విద్యార్థులు
కౌటాల, డిసెంబర్ 27: ప్రభుత్వ కళాశాలల మనుగడకు అత్యంత కీలకంగా మారిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు తమ ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వంపై పోరాటానికి అమితుమీకి సిద్దపడ్డారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సామూహిక సమ్మెను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ నెల 23 వ తేదీనుంచి పలువిధాలుగా తమ అందోళనలను వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు ఇటీవల ప్రభుత్వం జీ ఓ నెంబర్ 409 పేరిట రూ. 27000 వేతనాన్ని చేయడంతో మరింత గుర్రుగా ఉన్నారు. ఈ మేరకు తమ ఉద్యోగ భద్రత హామీని ప్రభుత్వంతో ఎలాగైనా సాధించుకోవాలనే లక్ష్యంతో బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంబంధిత కళాశాల ఇంచార్జ్‌లకు కాంట్రాక్ట్ లెక్చరర్లు సమ్మె నోటీసులను అందజేసారు.
పరీక్షలు సమీపిస్తున్న వేళ... అందోళన...
కళాశాలలో బోధిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు సమ్మెకు దిగుతుండటంతో ప్రభుత్వ కళాశాలలు పూర్తిగా అధ్యాపకులు లేక బోసిపోనున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తం 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా సుమారు 5 వేల పైచిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఆయా ప్రభుత్వ కళాశాలలో మొత్తం కలిపి జిల్లా వ్యాప్తంగా కేవలం 13 మంది మాత్రమే రెగ్యూలర్ లెక్చరర్లు ఉన్నారు. వీరిలో ఏడుగురు లెక్చరర్లు ప్రిన్సిపల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రభుత్వ కళాశాలలు నడిచేందుకు కీలకమైన కాంట్రాక్ట్ లెక్చరర్లు జిల్లాలో 120 మంది పనులు చేస్తున్నారు. వీరంతా కూడా బుధవారం నుంచి సమ్మె చేస్తూ కళాశాలలకు రాకుంటే కళాశాలలు పూర్తిగా స్తంభిస్తాయనే చెప్పవచ్చు ఇప్పటికే విద్యా సంవత్సరం దాదాపు ముగింపు దశకు చేరుకొని బోధన పరంగా పాఠాలన్ని పూర్తయి ఉత్తమ ఫలితాలు లక్ష్యంగా ప్రత్యేక తరగతులు కొనసాగిస్తున్న వేళ ఈ సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ప్రభుత్వం జీ ఓ నెంబర్ 3 ప్రకారం 10 వ పీ ఆర్ సి అమలు చేస్తూ 37100 వేతనాన్ని ఇవ్వాలని అదికూడా పూర్తిగా ట్రెజరీ ద్వారానే వేతనాలు చెల్లించాలన్నది కాంట్రాక్ట్ లెక్చరర్ల ప్రధాన డిమాండ్‌గా సమ్మె కొనసాగనుంది. ఏది ఏమైనా ప్రభుత్వ కళాశాలలను నమ్ముకొని చదువుతున్న వేలాది మంది విద్యార్థిని, విద్యార్థుల భవిష్యతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ డిమాండ్ నేరవేరేదాక కళాశాలలకు వచ్చేది లేదని కళాశాలల జే ఏసి తేగేసి చెబుతుంది.
తిర్యాణిలో..
తిర్యాణి: సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్ట్ జే ఏసి ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను చేపట్టనున్నట్లు తిర్యాణి జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు అనీల్ కుమార్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో తాము ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని, తమ సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏ సి ఆధ్వర్యంలో బుధవారం ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి అనంతరం నిరవధిక సమ్మెలో పాల్గొనన్నుట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు మహేశ్వర్, సత్య గణపతి, హన్మంతు, నవీన్‌రెడ్డి, మంజి, లక్ష్మణ్, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్న కేసిఆర్
టిడిపి జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్
బెల్లంపల్లి, డిసెంబర్ 27: తెలంగాణ ముఖ్యమంత్రి కే సి ఆర్ ఎన్నికల సందర్బంగా ఆనేక హామీలు ఇచ్చి ఆహామీలను నేరవేర్చక ప్రజలకు వెన్నుపోటు పోడుస్తు గడీల పాలన సాగిస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షుడు బోడ జనార్థన్ విమర్శించారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని టి ఎన్ టియూసి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో టిడిపి సభ్యత్వ నమోదు 99 శాతం పూర్తయిందన్నారు. జిల్లా లోని ప్రతి గ్రామంలో 20 నుంచి 50 సభ్యులు ఉన్నారని తెలిపారు. బెల్లంపల్లి నియోజక వర్గంలోని ఏడు మండలాలు 67 గ్రామ పంచాయతీలు పట్టణంలోని 34 వార్డులో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎన్నికల మెనిఫెస్టో లో ఇచ్చిన హామీలను అమలు పరుస్తానని మాట ఇచ్చిన కే సి ఆర్ రెండున్నర సంవత్సరాలలో ప్రజలకు మాయ మాటలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. కే సి ఆర్‌కు సంబంధించిన వాహనాలు, తమ ఇల్లును బుల్లెట్ ప్రూఫ్‌తో నిర్మించుకున్నారని కే సి ఆర్ తన పాలన మీద ఎంత అభద్రత భావం ఉందో తెలుస్తుంది అన్నారు. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి అని దళితులను మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రొఫేసర్ జే ఏసి కోదండరాం పై ఎంపి, ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 2019 అధికారంలో టిడిపి అధికారంలోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో టిడిపి పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నియోజక వర్గ ఇంచార్జ్ పాటి సుభద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు మురుకూరి చంద్రయ్య, సీనియర్ నాయకులు దామెర శ్రీనివాస్, తాటికొండ శంకర్, గోప రాజన్న, లక్ష్మణ్, ఎంబడి సత్యనారాయణ, లింగాల జలపతి, తదితరులు పాల్గొన్నారు.
వేటగాళ్ల రిమాండ్
కౌటాల, డిసెంబర్ 27: కౌటాల పోలీస్ సర్కిల్ పరిధిలోని కుకుడ సమీపంలో గల మద్దిగూడెం పంట పొలాలలో వణ్య ప్రాణుల కోసం కరెంట్ తీగలు అమర్చి లెండుగూరి శంకర్ అనే వ్యక్తి మృతికి కారణమైన వేటగాళ్లు నైతం సుభాష్, అత్రం భీమయ్య, కోరెత సురేష్ లను మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కౌటాల సీ ఐ అచ్చేశ్వర్ రావు, బెజ్జూర్ ఎస్సై బండారి రాజు తో కలిసి సర్కిల్ కార్యాలయంలో నిందితులను రిమాండ్‌కు తరలించి వివరాలను తెలిపారు. మొత్తం నలుగురు వేటగాళ్లు కాగా ముగ్గురుని అదుపులోకి తీసుకోవడం జరిగిందని కోరెత సతీష్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు త్వరలోనే అతని కూడా పట్టుకుంటామని సీ ఐ తెలిపారు. వణ్య ప్రాణులను హతం చేయాలనే కారణంతో పంట పోలాల్లో రహదారుల వెంట కంచెలు అమర్చే వీరు ఇటీవల మద్దిగూడ సమీపంలోని పంట పోలాలలో వైర్లు బిగించి విద్యుత్‌ను సరఫరా చేయడంతోనే శంకర్ మృతి చెందాడని సీ ఐ వివరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మొగిలి మల్లేష్ తదితరులు ఉన్నారు.
వణ్యప్రాణుల వేటను సహించేది లేదు: సిఐ
అటవీ ప్రాంత పరిసరాలలో పంట పొలాల్లో వణ్య ప్రాణుల విద్యుత్ షాక్‌తో వేటాడటం ఎంత మాత్రం క్షమించే విషయం కాదని వణ్య ప్రాణుల వేట కోసం అమర్చే విద్యుత్ తీగల ఉచ్చుకు విలువైన ప్రాణాలు కోల్పోవ డం క్షమించే విషయం కాదని కౌటాల సీ ఐ అచ్చేశ్వర్ అన్నారు. మద్దిగూడ గ్రామ సమీపంలో వణ్య ప్రాణుల కోసం అమర్చిన తీగలు తగిలి లెండుగూరి శంకర్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో నిందితులను ముగ్గురిని రిమాండ్‌కు తరలించిన సందర్బంగా వేటగాళ్లకు గట్టి హెచ్చరిక చేసారు. ఎట్టి పరిస్థితులోను వణ్యప్రాణుల వేట ఉపేక్షించే పరిస్థితి లేదని ఇప్పటికే తమ వంతుగా అన్ని గ్రామాల్లో అవగాహన కల్పించడం జరిగిందని అటవీ ప్రాంతానికి సరిహద్దున ఉన్న పంట పొలాల్లో వణ్య ప్రాణులు తిరగడాన్ని నిరోదించేందుకు కర్రలతో కంచెలు ఏర్పాటు చేసుకొని కొద్ది పాటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. అంతేతప్ప వాటిని హతమార్చేందుకు విద్యుత్ తీగలు అమరిస్తే ఊరుకోం అని హెచ్చరించారు. వీటి వల్ల అమాయకుల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఈ విషయం పై ఎవరైనా ఉచ్చులు బిగిస్తే వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఆయన ప్రజలను కోరారు.
కలెక్టర్ ఆదేశాల మేరకే విచారణ: డిఇఓ
భీమిని, డిసెంబర్ 27: మండల కేంద్రంలోని కసూర్బా గాంధీ బాలిక ల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే మంచిర్యాల జిల్లా విద్యాధికారి రవికాంత్ రావు విచారణ చేపట్టారు. గత 10 రోజుల క్రితం కస్తూర్బా విద్యాలయాల్లో ఆహారం వికటించి 25 మంది విద్యార్థినిలు ఆస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేక అధికారిణి కవిత, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా పాఠశాలలో మెనూ పాటించడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు. వారి ఫిర్యాదు మేరకు విచారణ చేసారు. విచారణలో భాగంగా పాఠశాలలోని విద్యార్థులతో పాటు సిబ్బంది ఉపాధ్యాయులు వంట మనుషులను విడివిడిగా విచారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక అధికారిణి పని తీరు సరిగ్గా లేదని పాఠశాలలో విద్యార్థులకు ఆహారాన్ని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విచారణ తేలిందన్నారు. ఆమె పని తీరుపై సమగ్ర నివేధికను రూపొందించి ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి మండల కేంద్రంలోని శ్రీహర్ష మెడల్ స్కూల్ తనిఖీ చేసారు. పాఠశాలలో విద్యార్థులకు ఉన్న సౌకర్యాలు పరిశీలించారు. పాఠశాలకు సంబంధించి ఆట స్థలం, కూర్చోడానికి బెంచ్‌లు, నీటి సౌకర్యం సరిగ్గాలేదని పాఠశాలలో బోధన సిబ్బందికి సరియైన విద్యార్హతలు లేకుండా నియమించుకున్నట్లు తేలిందని పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు అందించాలని మండల విద్యాధికారిణి అదేశించారు. అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలను సందర్శించి వసతులను పరిశీలించారు. డిఈ ఓ వెంట మండల విద్యాధికారి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.

ప్రభుత్వ బడుల్లో చదివిన వారే ఉన్నత స్థానంలో ఉన్నారు
* నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇలంబరిది
మామడ, డిసెంర్ 27: ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు ఉన్నతమైన స్థానంలో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారని, తానుకూడా ప్రభుత్వ పాఠశాలలో చదివానని కలెక్టర్ ఇలంబరిది అన్నారు. మంగళవారం మండలంలోని పొన్కల్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, బట్టిపద్దతిని మానుకోవాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. గత కొన్ని నెలల నుండి బిల్లులు రావడం లేదని, దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో బిల్లులు మంజూరుచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివలింగయ్య, సర్పంచ్ రాజవ్వ, తహసిల్దార్ రామస్వామి, ఎంపిడివొ శేఖర్, ఈవొపి ఆర్‌డి కమలాకర్, ప్రధానోపాధ్యాయులు ఫహీం, ఆర్ ఐ చిన్నయ్య, ఎపి ఎం అరుణ, నాయకులు హరీష్‌కుమార్, నవీన్‌రావు, రాజారెడ్డి, అర్జున్, తదితరులు ఉన్నారు.
శతాధిక వృద్ధురాలు మృతి
లక్సెట్టిపేట, డిసెంబర్ 27: పట్టణంలోని బ్రహ్మాణ వాడకు చెందిన శేషోజ్జల గంగూబాయి (108) అనే శతాధిక వృద్దురాలు సోమవారం రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గంగూబాయి స్వాతంత్య్ర సమరయోధురాలు బ్రహ్మణవాడలో నివాసం ఉంటుంది. గత కొంత కాలంగా అనారోగ్యం బాధపడుతూ తుది శ్వాస విడించింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పలువురు మహిళలు ఆమె మృతదేహం వద్దకు వెళ్లి ఘనంగా నివాళులు అర్పించారు.
ఎస్టీయు క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
దివ్యనగర్,డిసెంబర్ 27: నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్‌లో మంగళవారం సాయంత్రం ఎస్టీయు 2017 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ, జీవొల పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఇలంబరిది, జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్యలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు జీవొల పుస్తకం ఉపయోగపడుతుందన్నారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఎస్టీయు అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రామారావు, జుట్టు గజేందర్, నిర్మల్ సెక్టార్ అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు జె.లక్ష్మణ్, ఇర్ఫాన్‌శేఖ్, సంఘ బాధ్యులు సిరాజొద్దిన్, రాజన్న, జడ్‌హెచ్ మసూద్, అన్సార్ హైమద్, మోహన్‌రావు, రాంరెడ్డి, ఉమా మహేశ్వర్‌రెడ్డి, సంతోష్‌కుమార్, ఇంత్యాజ్ అహ్మద్, లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.