అదిలాబాద్

ముంపు బాధితుల గోడు పట్టించుకోరా.. ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్,్ఫబ్రవరి 6: ఒకవైపు రైతు ప్రభుత్వమంటూ ప్రకటనలు గుప్పించే టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని రైతులకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదని బిజెపి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.రమాదేవి విమర్శించారు. మామడ మండలం పొన్కల్ గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించే సదర్‌మాట్ బ్యారేజీ కోసం విలువైన భూములను కోల్పోయిన రైతులకు నేటికీ నష్టపరిహారాన్ని అందించకపోవడం శోచనీయమన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద కాలువల నిర్మాణం కోసం సారంగాపూర్, దిలావర్‌పూర్ మండలాల్లో రైతుల నుండి భూములను లాక్కున్నారని, వారికి కూడా ఇప్పటివరకు నయాపైసా చెల్లించలేదన్నారు. సోమవారం భూములు కోల్పోయిన రైతులకోసం బిజెపి ఆధ్వర్యంలో నిర్మల్‌లో భారీ ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడిని నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ శివలింగయ్యకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా రమాదేవి మాట్లాడుతూ సదర్‌మాట్ బ్యారేజీ కోసం 4 గ్రామాల రైతుల భూములు ముంపునకు గురవ్వగా వాటికి రెవెన్యూ, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి వ్యవసాయ భూములు కోల్పోయే రైతులకు ఎకరానికి రూ. 8 లక్షల నుండి 9.50 లక్షల వరకు చెల్లిస్తామని చెప్పారన్నారు. కానీ వాటికి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. చట్టప్రకారం ముంపు బాధితులకు పునరావాసం కల్పించకుండా పనులు ప్రారంభించవద్దనే నిబంధన ఉన్నప్పటికీ గత నాలుగు నెలలుగా ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. దీనివల్ల రైతులకు కోల్పోయిన భూమికి బదులుగా మరోచోట భూములు కొనుక్కునేందుకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. నష్టపరిహారం చెల్లించకుండా భూములు స్వాధీనం చేసుకోవడం వల్ల పంటనష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రాణహిత చేవెళ్ల హైలెవల్ కెనాల్ వల్ల ముంపునకు గురవుతున్న దిలావర్‌పూర్, నర్సాపూర్(జి), సారంగాపూర్, నిర్మల్ తదితర మండలాలతోపాటు ముధోల్ నియోజకవర్గంలోని గ్రామాల రైతులకు కనీస సమాచారం లేకుండా కాంట్రాక్టర్‌తోపాటు అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు, అధికారులు కలిసి భూములను స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆయా భూముల్లో ప్రస్తుతం పంటలు ఉన్నాయని, అయినా లెక్కచేయకుండా రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రీసెటిల్‌మెంట్ యాక్ట్ 2013 ప్రకారం రైతుల సమ్మతి లేకుండానే భూములు, పంటలకు చట్టపరమైన నష్టపరిహారం, పునరావాసం, వసతులు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి బిజెపి అడ్డుకాదని, రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే పోరాటాలు చేస్తున్నామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గోదావరి, కృషా ణజలాల కన్వీనర్ రావుల రాంనాథ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒడిసెల శ్రీనివాస్, మెడిసెమ్మ రాజు, అసెంబ్లీ కన్వీనర్ సామ రాజేశ్వర్‌రెడ్డి, కిసాన్‌మోర్చ జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షులు నాయుడి మురళీధర్, నాయకులు రాజేందర్, సత్యనారాయణ, లింగన్న, గంగాధర్, రైతులు పాల్గొన్నారు.

ప్రజాఫిర్యాదుల విభాగంతో సమస్యలకు సత్వర పరిష్కారం
జిల్లా జాయింట్ కలెక్టర్ శివలింగయ్య

నిర్మల్,్ఫబ్రవరి 6: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రీవెన్‌సెల్‌కు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగానికి వివిధ ప్రాంతాల నుండి బీడీ కార్మికుల, వృద్దాప్య, వితంతు పింఛన్లకు సంబంధించిన 30 దరఖాస్తులు రాగా, గృహనిర్మాణం కోసం 130, ఇతర అంశాలకు సంబంధించిన 8 దరఖాస్తులు వచ్చాయి. కడెం మండలం దర్మాజిపేట్‌కు చెందిన సత్తన్న మరుగుదొడ్డిని నిర్మించుకున్నప్పటికీ తనకు డబ్బులు అందలేదని ఫిర్యాదు చేశారు. భైంసాకు చెందిన కె.బాపురావు సుద్దవాగు ప్రాజెక్టులో తాను భూమి కోల్పోయానని పరిహారం ఇప్పించాలని కోరారు. పట్టణానికి చెందిన కె.రత్నజ్యోతి తమ ప్లాట్లను కొందరు అక్రమార్కులు కబ్జాచేశారని వారినుండి ఇప్పించాలని వినతిపత్రాన్ని అందజేశారు. మంజులాపూర్ గ్రామానికి చెందిన దివ్య వ్యవసాయ సాగు పరికరాలను ఇప్పించాలని దరఖాస్తు చేసుకుంది. ఆయా సమస్యలపై వెంటనే పరిష్కారం చూపాలని జెసి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్, డిపివో నారాయణ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సిపివొ మల్లికార్జున్, పశుసంవర్ధకశాఖ ఎడి డాక్టర్ ప్రభాకర్, జిల్లా వైద్యాధికారి జలపతినాయక్, డిఎంవో శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటికీ తాగునీటిని అందించి
దప్పిక తీరుస్తాం

లక్సెట్టిపేట, ఫిబ్రవరి 6: వేసవి కాలానాకికల్లా ప్రతి ఇంటికీ తాగు నీరు అందించి దప్పిక తీరుస్తామని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. సోమవారం మండలంలోని లక్ష్మిపూర్ గ్రామంలో మిషన్ భగీరథ కింద మంజూరైన మంచినీటి ట్యాంకు పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ గ్రామీణ ప్రజల శ్రేయస్సు కోరి ఎన్నో మహోత్తర మైన కార్యక్రమాలు చేపట్టారని, తద్వారా రైతులుకు లాభం చేకూరుతుందన్నారు. వ్యవసాయానికి పంటలు పండించుకోవడానికి మిషన్ కాకతీయ పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి వ్యవసాయ రంగానికి నీరు అందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికీ తాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా లక్సెట్టిపేట, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు గ్రామాలకు నీరు అందుతుందన్నారు. ఈకార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి, జడ్పీటిసి చుంచు చిన్నయ్య, ఎంపిపి కట్ల చంద్రయ్య, ఉపాధ్యక్షుడు పాదం శ్రీనివాస్, తెరాస మండల అధ్యక్షుడు కోడేటి శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ గంగుల దీప, నాయకులు లచ్చన్న, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఏకాగ్రతతో చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యం

లక్సెట్టిపేట, ఫిబ్రవరి 6: విద్యార్థులు ఏకగ్రత చదివినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని సైకాలజీస్టు గంప నాగేశ్వర్‌రావు సూచించారు. సోమవారం ఇక్కడి ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్ పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు వార్షిక పరీక్షల సమయంలో భయపడకుండా ఒత్తిడికి లోను కాకుండా చదవాలన్నారు. పరీక్షల సమయంలో అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా చదువుకోవాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయులు సూచించిన మెళుకువలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యాబోధన చేసే సమయంలో ఏకగ్రతతో విన్నట్లయితే ఎలాంటి ప్రశ్నలకైనా జవాబులు రాయవచ్చన్నారు. అంతేకాకుండా తరగతి గదిలోని విద్యార్థులంతా గ్రూప్‌లుగా ఏర్పడి ప్రశ్నలపై చర్చించుకున్నట్లయితే వాటి జవాబులు తెలుస్తాయన్నారు. పదో తరగతి విద్యార్థులు ఉదయం 4 గంటల సమయంలో నిద్ర లేచి చదువుకున్నట్లయితే తాను చదువుకున్న ప్రశ్నలు జవాబులు అన్నీ మెదడులో గుర్తుండిపోతాయని తెలిపారు. ఈ సదస్సు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఈ అవగాహన సదస్సుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన పదో తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా విద్యాధికారి రవికాంత్ కూడా పదో తరగతి విద్యార్థులకు సలహాలు అందించారు. ఈకార్యక్రమంలో సిఐ మోహన్, ఎస్సైలు సమ్మయ్య, వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి రవీందర్, ప్రధానోపాధ్యాయులు ఎలాండర్ ఆర్‌పి, చంద్రశేఖర్, కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
దండేపల్లి, ఫిబ్రవరి 6: మండలంలోని గూడెం శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి బ్రహోత్సవాలు కోనసాగుతున్నాయి. రెండవ రోజైన సోమవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. బ్రహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సప్తాహ భజనలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు, ఆలయ వ్యవస్థాక చైర్మన్ గోవర్ధన వెంకటస్వామి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు చంద్రశేఖర్, కెవి.సత్యనారాయణ, సిబ్బంది సువర్ణ, అంజయ్య, సత్తయ్యలు పాల్గొన్నారు.

విశ్వవిద్యాలయాల పరిరక్షణకై ఉద్యమించాలి
- 8న పాలమూరులోని రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి
- పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకరి సత్యం
మంచిర్యాల, ఫిబ్రవరి 6: ప్రభుత్వ విశ్వ విద్యాలయాల పరిరక్షణకై ఉద్యమించాలని పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకరి సత్యం అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 8న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించే యూనివర్సిటీల పరిరక్షణ రాష్ట్ర సదస్సు పోస్టర్లను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల పాలనలోనే కాదు తెలంగాణ పాలకుల చేతులలో కూడా యూనవర్సిటీలు వివక్షకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేసి పరిశోధనలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు. విద్యారంగానికి సరిపడ నిధులు కేటాయించకుండా దేశంలోకి విదేశీ యూనివర్సిటీలను అహ్వానించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ విధానాలు అర్థమవుతున్నాయని తక్షణమే యూనివర్సిటీలను వెనక్కి పంపించే చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో విద్యార్థులు ప్రతిఘటన చేయాల్సిన సమయం వస్తుందని హెచ్చరించారు. యూనివర్సిటీల పరిరక్షణకై విద్యార్థులలో చైతన్యం తీసుకు వచ్చేందుకే సదస్సును నిర్వహిస్తున్నామని ఈ సదస్సుకు జిల్లాలోని విద్యార్థులంతా అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ డివిజన్ కార్యదర్శి తోట రాజేష్, డివిజన్ నాయకులు గోవర్థన్, సురేష్, శ్రీవర్థన్, దివాకర్, రాజ్‌కుమార్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

రాష్టస్థ్రాయి కరాటే పోటీల్లో
మండల విద్యార్థుల ప్రతిభ
కడెం, ఫిబ్రవరి 6: ఈ నెల 5న మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో జరిగిన షిటోరియా కరాటే రాష్టస్థ్రాయి పోటీల్లో కడెం మండలంలోని నవాబ్‌పేట్, దస్తురాబాద్ గ్రామాలకు చెందిన ఒకినోవా కరాటే స్కూల్ విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభకనబర్చి పలు విభాగాల్లో 12 పతకాలను సాధించారు. హిటోరియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్లాక్‌బెల్ట్ 4వ డాన్ నిర్వహించిన రాష్టస్థ్రాయి కరాటే పోటీల్లో జూనియర్ స్పారింగ్ విభాగంలో ఎస్.వైష్ణవ్ కాంస్యపతకం, గణేష్ రజతం, విష్ణువర్ధన్ రజతం, ఆదిత్య, అక్షయ్ బంగారు పతకం, ఎ.అజయ్ స్వర్ణ పతకాలు సాధించగా సీనియర్ స్పారింగ్ ఫస్ట్ డివిజన్‌లో ఎస్.శివాణి కాంస్యపథకం, అఖిల్, ఎస్.వర్ష రజత పతకాలను సాధించారు. సీనియర్ బ్రౌన్, బ్లాక్ స్పారింగ్ విభాగాల్లో కొమురవెళ్లి లక్ష్మి ప్రసాద్ స్వర్ణ పతకం ప్రథమస్థానం, కటా విభాగంలో స్వర్ణ పతకాలను సాధించారు. పై విద్యార్థులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టణ వన్‌టౌన్ ఎస్సై రవి పథకాలను, సర్ట్ఫికెట్లను అందజేసి అభినందించారు. అదేవిధంగా కేరళ హైస్కూల్‌కు చెందిన విద్యార్థినులను పాఠశాల కరస్పాండెంట్ వినిత అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒకినోవా కరాటే స్కూల్ ఇన్‌స్ట్రక్టర్ కె.్భమేష్ తదితరులు పాల్గొన్నారు.

బాసర క్షేత్రంలో కొనసాగుతున్న రద్దీ

బాసర,్ఫబ్రవరి 6: బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. మాఘశుద్ధ దశమిని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస పూజలను తమ చిన్నారులకు జరిపించుకోవడానికి తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ముహూర్త బలం ఉండడంతో అక్షరాభ్యాస మండపాలు భక్తులు, చిన్నారులతో సందడిగా మారాయి. 800 మంది చిన్నారులకు ఆలయ అర్చకులు ఘనంగా అక్షరాభ్యాస పూజలను జరిపించారు. సుమారు 5 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
మాజీ మంత్రి పూజలు....
బాసర అమ్మవారి సన్నిధిలో సోమవారం ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ను ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వెయ్యి రూపాయల అక్షరాభ్యాస మండపంలో మాజీ మంత్రి తన మనవడికి అక్షరాభ్యాస పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం సరస్వతి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు మాజీ మంత్రిని శాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.
కరీంనగర్ రేంజ్ డిఐజి పూజలు
బాసర సరస్వతిదేవి సన్నిధిలో సోమవారం కరీంనగర్ రేంజ్ డిఐజి రవివర్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న డిఐజిని ఆలయ అర్చకులు, అధికారులు మంగళవాయిద్యాలు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో డిఐజిచే ఆలయ స్థానాచార్యుడు ప్రవీన్‌పాఠక్ కుంకుమార్చన పూజలు జరిపించారు. హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆలయ విశిష్టత, చరిత్రను ఆయనకు వివరించారు. ఆలయ సూపరింటెడెంట్ సాయిలు డిఐజి రవివర్మను శాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. వీరివెంట బాసర ఎస్సై మహేష్, ఆలయ సిబ్బంది ఉన్నారు.

కుల వృత్తుల అభివృద్ధికి కృషి
బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న
తలమడుగు,్ఫబ్రవరి 6: కుల వృత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం మండలంలోని కుచులాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తోట గణపతి రావ్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కులవృత్తులవారు పూర్తిగా అభివృద్ధిలో వెనుకబడ్డారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కుల వృత్తుల సంక్షేమానికి సబ్సిడీ రుణాలను పంపిణీ చేసిందన్నారు. ఇప్పటికే యాదవ కులస్తులకు పెద్ద ఎత్తున మేకలు, గొర్రెల యూనిట్లను మంజూరు చేశామన్నారు. గంగపుత్రుల అభివృద్ధికి చేప పిల్లలను ఉచితంగా అందించడంతో పాటు రుణాలు మంజూరు చేశామన్నారు. ఒంటరి మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశంతో త్వరలోనే వారికి రూ.1500 చొప్పున పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలన్నారు. మంత్రి వెంట టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, రైతు సంఘం నాయకుడు గోవర్ధన్ రెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె.రాజన్న, తలమడుగు జడ్పీటిసి జక్కుల గంగమ్మ ప్రభాకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.