అదిలాబాద్

వెనకబడ్డవర్గాల అభ్యున్నతికి సహకార సంఘాల తోడ్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, మార్చి 24: వెనకబడ్డవర్గాల అభ్యున్నతికి సహకార సంఘాలు ఎంతగానో తోడ్పడతాయని కుమ్రంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. శుక్రవారం ఐటిడిఏ ఉద్యానవన కేంద్రంలో నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక మండలి సభ్యుల శిక్షణా తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యంగా సహకార సంఘాలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఉపయోగ పడుతాయన్నారు. చట్టాల గురించి సభ్యులకు తెలియ చేసేందుకు ఏర్పాటు చేసిన ఈశిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలకు ఈ సంఘాలను భాగస్వామ్యులను చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుండి సరఫరా అయ్యే సబ్సిడీ విత్తనాలు పక్కదారి పట్టకుండా సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు. సహకార సంఘాలు బాధ్యతాయుతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డిసిఓ మద్దిలేటి, సభ్యులు పాల్గొన్నారు.