అదిలాబాద్

పేదల ఆత్మగౌరవం కోసమే డబుల్ బెడ్‌రూం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మార్చి 26: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతిఒక్కరూ ఆత్మగౌరవంగా బతికేలా ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, అర్హులైన వారికే డబుల్‌బెడ్ రూం ఇళ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. జైనథ్ మండల కేంద్రంలో 131 డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఆదివారం మంత్రి రామన్న శంకుస్థాపన గావించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లా డుతూ మహిళల సాధికారిత, స్వయం ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తోందని, బడ్జెట్‌లో బిసి సంక్షేమ రంగానికి పెద్దపీటవేసి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని, బిసి కమిషన్ నివేదిక రాగానే సంక్షేమానికి మరింత ప్రాధాన్యత కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలకు తావులేకుండా పేదలందరికి నిర్మించి ఇస్తామన్నారు. త్వరలోనే లబ్దిదారుల ఎంపిక పూర్తిచేసి పారదర్శకంగా గృహాలు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని, ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మవద్దన్నారు. 60ఏళ్ల కాంగ్రెస్‌పాలనలో జరగని అభివృద్ది తెరాస ప్రభుత్వం మూడేళ్ళలో చేసి చూపించిందన్నారు. సంక్షేమ రంగాల్లో దేశంలోనే రాష్ట్ర అగ్రగామిగా నిలిచిందన్నారు. పెన్‌గంగా ప్రాజెక్టు ద్వారా బీడుభూములను సాగులోకి తీసుకవస్తామని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లో వౌలిక వసతులతో పాటు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి కాలనీలో అంతర్గత సిసి రోడ్లనిర్మాణంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు భారీ ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అక్కడే జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి రామన్న ప్రసంగిస్తూ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకమంది టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని, త్వరలోనే గ్రామ, మండల కమిటీ, జిల్లా కమిటీలను పూర్తిచేయడం జరుగుతుందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలని, పార్టీకోసం కష్టపడే వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని మంత్రి రామన్న స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె.రాజన్న, ఎంపిపి చంద్రయ్య, టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు అడ్డి బోజారెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.