అదిలాబాద్

కార్పొరేట్‌కు ధీటుగా గురుకులాల ఉన్నతీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 16: కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడానికే ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలతో 119 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర అటవీ,పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని పిట్టలవాడ, చాందాటి గ్రామంలో మైనార్టీ గురుకుల విద్యాలయాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చాందాటి గ్రామంలోని బాలుర మైనారిటీ గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రామన్న మాట్లాడుతూ పేద విద్యార్థులకు రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఆధునిక వసతులు, హంగులతో ఈ విద్యా సంవత్సరం నుండే గురుకులాలను ప్రారంభిస్తున్నామన్నారు. ఒక్కో విద్యార్థికి లక్షా 50వేల చొప్పున ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం రూ.20లక్షల ఆర్థిక సాయం అందించనుందని, ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల బిసి గురుకులాలను కూడా ప్రారంభించగా, పేద విద్యార్థుల నుండి భారీ స్పందన వచ్చిందన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ గురుకులాల్లో నాణ్యమైన విద్యాబోధన అందించడంతో పాటు వౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. గురుకులాల్లో చదువుకుంటున్న పిల్లలు వారి తల్లిదండ్రుల ఆశయాలకనుగుణంగా కష్టపడి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థికసాయం కింద రూ.20లక్షలు అందజేస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్య వల్లనే సమాజం అభివృద్ది చెందుతుందన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కోట్లాది నిధులను ఖర్చు చేస్తూ గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు గురుకులాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 6మైనారిటీ, బిసి గురుకులాలను ఈ విద్యా సంవత్సరం నుండే ప్రారంభించడం జరిగిందన్నారు. దీనిని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని శిఖరాలను అదిరోహించాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా మాట్లాడుతూ సంపూర్ణ ఆక్షరాస్యత సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కెజి టు పిజి ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా గురుకులాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యాబోధనతో పాటు వౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడలో బాలికల మైనారిటీ గురుకులాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, జడ్పీటీసీ ఆశోక్, మండల ఉపాధ్యక్షులు గంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ రాజన్న, మావల, చాందాటి సర్పంచ్‌లు రఘుపతి, అడెల్లు, ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్ళు, డిఎండబ్ల్యూవో నదీం, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.