అదిలాబాద్

తెల్ల బంగారం ధగ ధగ పత్తి ధర పైపైకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 30: పత్తి వ్యాపారం మందగించిన నేపథ్యంలోనే మార్కెట్‌యార్డుల్లో కనీస పత్తి మద్దతు ధర పైపైకి పెరగడం రైతులు, వ్యాపారుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. గత అక్టోబర్ మాసంలో క్వింటాలు మద్దతు ధర కేవలం రూ.4100 నుండి 4300 వరకు పలకగా రైతులు ఇప్పటికే 70శాతం మేర పత్తి నిల్వలను విక్రయించుకోగా వ్యాపారులకు మాత్రం ఈ సీజన్ దండిగా కాసులు కురిపించనుంది. రైతులు పత్తి విక్రయించే సమయంలో కనీస మద్దతు ధర తగ్గిపోయి రైతులు అందోళన చెందగా వ్యాపారుల వద్ద నిల్వలు పెరిగిన సమయంలోనే ధరకు రెక్కలు రావడంతో వ్యాపారులకు ఈ సీజన్ కలిసి వచ్చినట్లయింది.
ఆదిలాబాద్ మార్కెట్‌లో క్వింటాలు మద్దతు ధర రూ.5100 పలకడంతో రై తులు తమ నిల్వలను విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకంటే మరో 200 వరకు మా త్రమే ధర పెరిగే అవకాశం ఉండడంతో మార్కెట్‌యార్డుల్లో జోరుగా పత్తికొనుగోళ్ళు జరుగుతున్నాయి. వ్యాపారుల మాయజాలం కారణంగానే పంట సీజన్ చివరి సమయంలో ధరలు పెరగడం గమనార్హం.
జిల్లా వ్యాప్తంగా ఐదు మార్కెట్‌యార్డుల్లో పత్తి కొనుగోళ్ళు చేపడుతున్నారు. సీజన్ ప్రారంభంలో పత్తి ధర రైతుల్లో కొంత అందోళన కలిగించినా.. క్రమంగా పెరుగుతున్న ధరతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 1.40లక్షల హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగుచేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పంట విస్తీర్ణం 42వేల హెక్టార్ల మేరకు పెరిగింది. అక్టోబర్ మొదటి వారంలో పత్తి పంట చేతికి రాగా రైతులు పత్తికొనుగోళ్ళ ప్రారంభదశలో తేమశాతంతో అందోళనకు గురికావాల్సి వచ్చింది. సీజన్ ప్రారంభంలో 25 నుంచి 30 వరకు తేమ చూపడంతో వ్యాపారులు కొనుగోళ్లకు వెనుకంజ వేయగా జిల్లా మంత్రి జోగురామన్న, అధికారులు వ్యాపారులతో చర్చించి పంట కొనుగోళ్ళలో ఏలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలోని పలు మార్కెట్‌యార్డుల్లో ఈ సీజన్ పత్తి విక్రయాల్లో పెద్దగా ఏలాంటి ఇబ్బందులు తలెత్తలేదనే చెప్పాలి. కొనుగోళ్ల ప్రారంభదశలో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు అందోళన చేసినప్పటికీ క్రమంగా పత్తి ధర పెరగడంతో రైతులు శాంతించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు మార్కెట్‌యార్డులతో పాటు నార్నూర్ సబ్ మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోళ్ళు చేపడుతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15.21 లక్షల క్వింటాళ్ళ పత్తిని వ్యాపారులు మార్కెట్‌యార్డుల్లో కొనుగోలు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో 12.60,120 క్విటాళ్లు, బోథ్‌లో 2.60,150 క్వింటాళ్ళు, ఇచ్చోడలో 29,150 క్వింటాళ్ళు, ఇచ్చోడలో 80,450 క్వింటాళ్ళు, జైనథ్‌లో 45,425 క్వింటాళ్ళు, నార్నూర్ సబ్ మార్కెట్‌యార్డులో 13,200 క్వింటాళ్ళ పత్తిని వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రతి రోజు 20 వేల క్వింటాళ్ళ పత్తి పంట విక్రయాలు జరగుతున్నాయి. ఈ ఏడాది మార్కెటింగ్, రెవెన్యూ శాఖ అదికారులు జీరో దం దాను నియంత్రించడంతో పాటు పట్టణాల్లోని వివిధ ప్రాంతాల్లో దళారులు పత్తిని కొనుగోలు చేపట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో మార్కెట్‌యార్డుల్లో ఎక్కువ సంఖ్యలో పత్తి కొనుగోళ్ళు జరిగాయి. దీంతో రైతులకు మంచి ధర లభించడమే కాకుండా మార్కెట్ ఫీజు వసూలులో గణనీయమైన పురోగతి సాధించింది. గతేడాది కంటే రెట్టింపు సా యిలో ఫీజు వసూలు కావడం గమనార్హం. సీజన్ ప్రారంభంలో ధర తక్కువగా ఉండడంతో చాలా మంది రైతులు పంటను విక్రయించలేదు. ధర పెరిగినప్పుడు పంటను అమ్ముకుందామనే ఆశతో కొందరు రైతులు పత్తి నిల్వలను భద్రపర్చుకున్నారు. ఇటీవల ధర పెరగుతుండడంతో పంటను అమ్ముకుంటూ లాభాలు ఆర్జీస్తున్నారు. పత్తి ప ంటకు గులాబి తెగుళ్ళు సోకడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదనే చెప్పాలి. గులాబి పురుగు ప్రభావం లేకుంటే పంట దిగుబడులు పెరిగే అవకాశాలు ఉండేవి. ప్రస్తుతం పత్తికి క్వింటాలు ధర రూ.5100 వరకు పెరగడంతో కొంతమేరకు రైతులకు లాభం చేకూరుతున్నప్పటికీ వ్యాపారులకు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర కాసులు కురిపిస్తోంది.