అదిలాబాద్

అంబరాన్నంటిన కొత్త సంవత్సర సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 1: గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2018 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా సం బురాలు మిన్నంటాయి. ఆదివారం అర్ధరాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం నుండే జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబురాల్లో మునిగితేలారు. ము ఖ్యంగా ఆలయాలు, ప్రార్థన మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణాలు సందడి చేశాయి. ఇదిలా ఉంటే సోమవారం ఉ దయం జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం లో కొత్త కలెక్టర్ దివ్య దేవరాజన్‌ను పలువురు కలుసుకొని శుభాకాంక్షలతో ముంచెత్తారు. టీ ఎన్జీవో, గజిటెడ్ అధికారులు, రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్, ఉద్యోగుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ అసోసియేషన్ అధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా 2018 సంవత్సర డైరీలు ఆవిష్కరించగా, తహసీల్దార్ల అసోసియేషన్‌కు సంబంధించిన క్యాలెండర్లను కలెక్టర్ దివ్య ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు కొత్త సంవత్సరంలో నూతన ఉత్తేజంతో ప్రభుత్వ లక్ష్యాలను అదిగమించి, అభివృద్దికి తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సాజిదొద్దిన్ అధ్వర్యంలో కలెక్టర్‌కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌ను పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, పార్టీల ప్రముఖులు కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు జెసి కె.కృష్ణారెడ్డి, డిఆర్‌డిఏ పిడి రాజేశ్వర్ రాథోడ్, జడ్పీ సిఈవో జితెందర్ రెడ్డి తదితరులు కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివ్య వివిధ శాఖల అధికారులతో సమావేశమై అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షించారు. ఆదిలాబా ద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకగా మద్యం ఏరులై పారింది. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో మంత్రి రామన్న బిజీబిజీ గా గడిపారు. రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాస గృహంలో పార్టీ కార్యకర్తలతో కలిసి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కా ర్యకర్తలకు తినిపించారు. ఈ ఏడాది టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కీలక సంవత్సరమని, ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేర్చి ఇచ్చిన హామీలను పూర్తిచేసేందుకు కార్యకర్తలు ముందుకు సాగాలని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్ళాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సాజిదొద్దిన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో పాటు ఆదిలాబాద్ డిఎస్పీ నర్సింహారెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి రామన్నను కలుసుకొని కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.