అదిలాబాద్

అభివృద్ధ్దికి పట్టం కట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, జనవరి 1 : బంగారు తె లంగాణ వైపు బాటలు వేస్తున్న తెరాస ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ది ప్రజల సంక్షేమాన్ని ప్రజలు గుర్తించి మరోసారి తెరాస విజయానికి మద్దత్తు ఇవ్వాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు. ఎంపీటీసీ స్థానానికి జరుగుతున్న ఎన్నికకు సంబంధించి సోమవారం సుమారు 2 వేల మంది తెరాస కార్యకర్తలు, నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి భారీ ర్యాలీని నిర్వహించారు. ఎమ్మెల్యే కోనప్ప పాల్గొన్న ఈ ర్యాలీ ఎమ్మెల్యే స్వగృహం నుండి ప్రారంభంమై ప్రదాన రహదారి వెంట కౌటాల బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనప్ప బా బు జెగ్జీవన్‌రాం, అంబేద్కర్, జ్యోతీబాపూలే, కుంమ్రంభీంల విగ్రహాలకు నివాల్లు అర్పించారు. బాజా బజంత్రి ఒగ్గుడోలు విన్యాసాలతో సాగిన ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకార్యకర్తలు ప్రజల నుద్ధేశించి ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ మారుమూల ప్రాం తంలో సిర్పూర్ నియోజకవర్గం కౌటాలలో జరిగిన అభివృద్ధ్దిని ఆయన అందరికి వివరించారు. గ్రామాల్లో వౌళిక సదుపాయాల కల్పణ కోసం ప్రభుత్వం ద్వార అన్ని విధాల కృషి చేయడం జరిగిందని, రెండు కోట్ల రూపాయలతో ప్రధాన రహదారి ని ర్మాణం జరుగుతోందని, అంతర్గత రహదారులు కూడా బాగమే అని పేర్కొన్నారు. కౌటాలలోని 432 ఆసరా పించన్ లకు గాను 43 లక్షల రూపాయల ప్రతి నెల ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు.