అదిలాబాద్

పెరిగిన మొక్కజొన్న సాగు విస్తీర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముధోల్, జనవరి 1: మొక్కజొన్న పంట సాగుతో లాభాలు పక్కాగ వస్తాయని రైతులు అంటున్నారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో రైతులు ముఖ్యమైన రబీ పంటలతో పాటు మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. మొక్కజొన్న పంట సాగుకు పెట్టుబడులు సహితం ఇతర పంటల కంటే తక్కువగా ఉంటుందని రైతులు తెలిపారు. మొక్కజొన్న పంట సాగు సహితం చాలా సులభంగా ఉంటుందని రైతులు వివరించారు. మొక్కజొన్న పంట వేసిన తరువాత నీళ్లు ఇవ్వడంతో పాటు రెండు సార్లు మందులు వేస్తే సరిపోతుంది. ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు మొక్కజొన్న పంట-2000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం మొక్కజొన్న సాగు పెరిగింది. పత్తిపంటకు గులాబీ పురుగు అశించడంతో రైతులు పత్తిపంటను పంటపోలాల నుండి తొలగించి వాటి స్థానంలో మొక్కజోన్న పంటను వేస్తున్నారు. కనీసం మొక్కజొన్న పంట అయిన తమను అదుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఆష్ట, బ్రహ్మన్‌గాం, బోరిగాం, గన్నోర, వి ఠోలి గ్రామాల్లో రైతులు వేసిన మొక్కజొన్న పంట ఎపుగా పెరిగింది. అదేవిధంగా ఇప్పటికి సహితం రైతులు నీళ్ల సౌకర్యం ఉన్న పంటపోలాల్లో మొక్కజోన్న వేశారు. రైతులు ఇతర పంటల కంటే మొక్కజొన్న పంటను సాగు చేస్తే పలు విధాలుగాలా భా లు పక్కాగా వస్తాయని పేర్కొన్నారు. మొక్కజొ న్న పంటలకు అడవి జంతువుల రుపంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు పంటలను కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు.