అదిలాబాద్

భూసర్వేతో వెలుగులోకి తప్పుల చిట్టా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 3: రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను, రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే ప్రక్షాళన కార్యక్రమం జిల్లాలో వందశాతం ముగిసింది. సెప్టెంబర్ 15 నుండి డిసెంబర్ 31 వరకు కొనసాగిన భూసర్వే గ్రామ సభల్లో రైతులు భారీ సంఖ్యలో హాజరై తమ వివాదాలను పరిష్కరించుకున్నారు. సర్వేకు ముందు ఆదిలాబా ద్ జిల్లాలో 8,45,138 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించగా సర్వే అనంతరం 8,46,952 ఎకరాల భూమి ఉన్నట్లు నిర్దారించారు. మిగిలిన 1814 ఎకరాల భూమికి సంబంధించిన ఆధారాలు బయట పడకపోవడంతో రెవెన్యూ సర్వేలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. భూసర్వేలో ఆసైన్డు, వ్యవసాయ, ప్రభుత్వ, వక్ప్‌భూములు, దేవాదాయ శాఖతో పాటు అటవీ భూములపై గ్రామ సభల ద్వారా సర్వే నిర్వహించి, రైతులకు సంబంధించి వివాదాలకు పరిష్కారం కనుగొన్నారు. జిల్లాలో 9,01, 467 ఎకరాలు భౌగోళిక విస్తీర్ణం ఉన్నట్లు గుర్తించగా రె వెన్యూ యంత్రాంగం 2,01,980 సర్వే నెంబర్లలో ప్రక్షాళన చేపట్టారు. వీటిలో 1,71,872 సర్వే నెంబర్లలో భూములు సరిగ్గా ఉన్నట్లు గుర్తించారు. 30, 108 సర్వే నెంబర్లలో తప్పులు దొర్లినట్లు అధికారులు ధృవీకరించారు. వీటిలో 38వేల ఎకరాలు త ప్పులుగా ఉన్నట్లుగా నిర్దారించారు. జిల్లా వ్యా ప్తంగా 3, 71,636 ఎకరాల్లో వ్యవసాయ భూమి, 1,88,485 ఎకరాల్లో అటవీ భూములు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారీగా సభలు నిర్వహిస్తూ సర్వే చేపట్టిన అధికారులు వారి దృష్టికి వచ్చిన సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. సర్వే అనంతరం లక్షా 36వేల 484 పాసుబుక్ ఖాతాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. వీటిలో 10,453 ఎకరాల్లో తప్పులు దొర్లినట్లు ఈ సర్వేలో గుర్తించడం గమనార్హం. ఇదిలా ఉంటే జిల్లాలో సుమారు 38వేల ఎకరాల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు తప్పులుగా ఉన్నాయని సమగ్ర సర్వేలో తేలింది. వీటిలో 2వేల ఎకరాలకు పైగా భూమి సివిల్ కోర్టులో కేసులు ఉండగా 1500 ఎకరాల భూమి రెవెన్యూ కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. అయితే సర్వే అనంతరం రెవెన్యూ, అటవీ శాఖల మద్య సరిహద్దుల గుర్తింపు సమస్య జిల్లా యంత్రాంగానికి చిక్కుముడి కానుంది. అటవీ శాఖ భూములు అన్యక్రాంతమవుతున్నట్లు తెలుస్తోంది. శివాయి జమేదార్ సమస్యలు 8,200 ఎకరాల్లో ఉండగా సాదాబైనామ 1900 ఎకరాల్లో, ఎల్‌టి ఆర్ కేసులు 1506 ఎకరాల్లో ఉన్నట్లు తేలిం ది. అయితే భూ సమగ్ర సర్వే పరిసమప్తం అయినప్పటికీ ఉట్నూరు ఏజెన్సీలో మాత్రం కొన్ని చోట్ల భూవివాదాలు తెరపైకి రావడం గమనార్హం. క్లిష్టమైన సమస్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. భూసర్వేలో పార్ట్‌ఏ, పార్ట్‌బి కింద విభజించగా వివాదస్పద పార్ట్‌బి సమస్యలను ఈ సదస్సుల్లో పరిష్కారం కనుగొనలేదు. జిల్లాలో సంపూర్ణంగా భూప్రక్షాళన కార్యక్రమం ముగియడంతో అధికారులు వాటి వివరాలను కంప్యూటర్లలో అప్‌లోడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

భూనిర్వాసితుల సమస్యకు సత్వర పరిష్కారం

ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్,జనవరి 3: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ బుధవారం ఆకస్మికంగా బజార్‌హత్నూర్ మండలం దేగామ మారుమూల గ్రామాన్ని సందర్శించి చెరువు కింద ముంపుబాధితుల సమస్యలపై ఆరా తీశారు. మూడో విడత కింద మంజూరైన 130 పక్కా గృహాలను ఐఏవై పథకం కింద నిర్మించి ఒకే ప్రదేశంలో కాలనీ ఏర్పాటు చేసే లా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే గతంలో మంజూరైన చట్టాలకు లోబడి నిర్వాసితులకు పరిహారం, పక్కాగృహాలు అందించడం జరుగుతుందన్నారు. ఇండ్ల స్థలాల కేటాయింపు లాటరీ పద్దతి ద్వా రా చేపట్టడం జరుగుతుందని అన్నారు. కాలనీల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. నష్టపోయిన భూములు, ఇండ్లకు ఎక్కువ ధర ఇప్పించాలని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకరాగా ఆర్ ఆండ్ ఆర్ , ఇండ్ల ని ర్మాణాల వాల్యువేషన్ ప్రకారం పరిహారం చెల్లించడం జరుగుతుందని అన్నారు. మాజీ జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, అనసూయ తదితరులు మాట్లాడుతూ వర్షాకాలంలో చెరువులోని నీరు గ్రామాల్లోకి వస్తాయని, పా ములు, విషపూరితమైన కీటకాలు గృహాల్లోకి వస్తున్నాయని, ఇళ్ల్లు కూలిపోతున్నాయని కలెక్టర్‌కు వివరించారు. అంతకు ముందు దేగామ గ్రామంలోని పలు వార్డులు, ఇండ్లు, చెరువు ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు.
14 ఎకరాల భూమిలో ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని, ఐఏవై పథకం కింద ఇండ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ వివరించారు అనంతరం జై భీం కమ్యూనిటీ భవనంలో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా ముంపు కాలనీలో మురికి కాలువలను దాటుతూ పరిసరాలను కలెక్టర్ పరిశీలించడం గమనార్హం.
ఇంటింటికి వెళ్తూ మహిళలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, నీటి పారుదల శాఖ ఈఈ సుశీల్, తహసీల్దార్ రాజేందర్ సింగ్, ఎంపిడీవో, సర్పంచ్ పాల్గొన్నారు.

సావిత్రీబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలి
జెసి కె.కృష్ణారెడ్డి
ఆదిలాబాద్ టౌన్,జనవరి 3: మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలేను ఆధర్శంగా తీసుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ శాఖ ఆవరణలో సావిత్రీబాయి 187వ జయంతిని పురస్కరించుకొని ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా జెసి మాట్లాడుతూ స్ర్తిల విద్యా అభ్యున్నతికి పాటుపడిన మహానీయురాలు సావిత్రీబాయి ఫూలే అని అన్నారు. సావిత్రీబాయి ఫూలే అడుగు జాడల్లో నడుస్తూ భారతీయ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అదే విధంగా బిసి సంఘం అధ్వర్యంలో సావిత్రీబాయి జయంతి వేడుకలను నిర్వహించగా, బిసి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, కోరెడ్డి పార్థసారథిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ అధికారి ఆశన్న, ఏవో భాగ్యలక్ష్మి, కిషన్, మనోహర్‌తో పాటు నాయకులు జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఆదిలాబాద్ టౌన్,జనవరి 3: ఎస్సీ వర్గీకరణను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చేలా ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకవెళ్ళాలని ఎమ్మార్పీ ఎస్ జిల్లా అధ్యక్షులు మోతె బారిక్‌రావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా ఎ మ్మార్పీ ఎస్ అధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకై పోరాటాలు చేయడం జరిగిందని, దాని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసినప్పటికీ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద త కల్పించేలా ముఖ్యమంత్రి కెసిఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకవెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తీసుకరావాలని డిమాండ్ చేశారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వందరోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడుతామని చెప్పి ఇప్పుడు కాలాయాపన చేయడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో అందోళనలు ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో రవి, శివకుమార్, గంగన్న పాల్గొన్నారు.

ఫూలే సేవలు చిరస్మరణీయం
మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే
ఆదిలాబాద్ టౌన్,జనవరి 3: భారత దేశంలో స్ర్తి విద్యకు నాంది పలికిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే సేవలు చిరస్మరణీయమని, ఆమె అడుగు జాడల్లో నడిచి నేటి భారతీయ మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాదిస్తున్నారని మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పె ట్కులే అన్నారు. సావిత్రీబాయి 187వ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ శాఖ ఆవరణలో గల ఫూలే దంపతుల విగ్రహాలకు మాలీ మహా సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ తన భర్త జ్యోతిరావు ఫూలే సహకారంతో సావిత్రీబాయి ఫూలే స్ర్తిల కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించి స్ర్తి అభ్యుదయానికి నాంది పలికిందన్నారు. అలాగే వితంతువుల కోసం, స్ర్తి శిశు సంరక్షణ కేంద్రాలను స్థాపించిందన్నారు. 1897 సంవత్సరంలో వచ్చిన ప్లేగువ్యాధి తన కొడుకు యశ్వంత్‌తో కలిసి 2వేల మందికి చికిత్స అందించిన సావిత్రీబాయి అదే వ్యాధితో చనిపోయిందని, ఆమె జీవితం మనందరికి ఆదర్శమని కొనియాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శెండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గుర్నులే, పట్టణ అధ్యక్షులు శ్రీను ఆచారి, సుభాష్, కిషన్, కల్పన, గంగు, మనీష, మధు, విజయ్ పాల్గొన్నారు.
తహశీల్ కార్యాలయం ముందు ఎమ్మార్పీ ఎస్ నిరసనలు
ఉట్నూరు,జనవరి 3: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు పార్లమెంట్‌లో చట్టబద్దత తీసుకరావాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీ ఎస్ అధ్వర్యంలో బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సంధర్భంగా ఎమ్మార్పీ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిరుదల లాసర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు దీక్ష చేపట్టడానికి ప్రయత్నించగా ప్రభుత్వం భగ్నం చేసిందన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బిజెపి ఎంపి, ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్షాలను కేంద్రప్రభుత్వం వద్దకు తీసుకవెళ్ళి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే విధంగా చూడాలన్నారు. ప్రస్తుత శీతాకాల సమావేశంలోనే వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత తీసుకరావాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈనెల 5వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. అనంతరం తహసీల్దార్ విశ్వనాథ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్ నాయకులు సంజీవ్, మహాదు, సుభాష్, సతీష్, సంబాజీ, భరత్ పాల్గొన్నారు.