అదిలాబాద్

పల్లె పల్లెకు టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు,జనవరి 20: ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోపల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టిడిపి ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి పరుశురాం రాథోడ్ తెలిపారు. శనివారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిందని, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నిస్వార్ధసేవతో రాష్ట్రాన్ని అభివృద్దిపథంలో నడుపుతూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఆ కోవలో గ్రామ గ్రామాన టిడిపికి పూర్వవైభవం తీసుకవచ్చేందుకు పల్లె పల్లెలకు టిడిపి కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. అదే విధంగా గ్రామ సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకవెళ్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు, తెరాస ప్రభుత్వ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించినా ఎక్కడా అభివృద్ది జరగలేదని, తెలుగు దేశం హయంలో జరిగిన అభివృద్దిని తమ అభివృద్దిగా చెప్పుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాటతప్పి దళితులకు మోసం చేశారని అన్నారు. వీటన్నింటిని ఎండగడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ టిడిపికి పూర్వవైభవం తీసుకవచ్చేందుకు కృషిచేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్ళపెల్లి రాజేశ్వర్, నాయకులు కొప్పుల విజయ్, సంజీవ్, సూర్యవంశి దయానంద్ పాల్గొన్నారు.

నేర రహిత తెలంగాణే లక్ష్యం
* డీ ఎస్పీ సాంబయ్య
సిర్పూర్ టి, జనవరి 20 : నేర రహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం అంతట సకల నేరస్తుల సర్వే కార్యక్రమం చేపట్టి నేర రహిత తెలంగాణే ద్యేయంగా పోలీసులు సర్వే లు చేపడుతున్నారని కాగజ్ నగర్ డీ ఎస్పీ సాంబయ్య అన్నారు. సిర్పూర్ టి మండల కేంద్రంలోని గొల్లవాడ, మేదరి వాడ ప్రాంతాల్లో పాత నేరస్తుల సర్వే కార్యక్రమాలను శనివారం పరిశీలించారు.
వివిధ కేసుల్లో నేరస్తులుగా ఉన్నవారి ఇండ్లలోకి వెల్లి వారి నేరానికి సంబందించిన కేసు వివరాలు, ప్రస్తుతం నేరస్తుని పరిస్థితి, కుటుంబ సభ్యుల వివరాలు, ప్రస్తుత నేరస్తుని పోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మోబైల్ నంబర్, ఓటర్ ఐడీ లతో పాటు నేరస్తు ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నామని డీ ఎస్పీ పేర్కొన్నారు. నేరస్తుల్లో మార్పు తీసుకు రావాలనే లక్ష్యంతో సర్వేలో వారికి అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్నారు.
ప్రస్తుత సర్వేల్లో గత పది సంవత్సరాల నుండి నమోదు అయిన రికార్డుల ఆధారంగా నేరస్తుల సమాచారాన్ని సేకరించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరస్తుల పూర్తి వివరాల ఆధారంగా సర్వేను సిబ్బంది విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్‌కు చేరుకుని గత మూడు రోజుల నుండి చేపట్టిన సర్వే వివరాలు పరిశీలించారు.