అదిలాబాద్

పల్స్‌పోలియోను పకడ్బందీగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్,జనవరి 20: ఈనెల 28న నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని టీం వర్కర్లతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 28న నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమం 0-5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే వచ్చేనెల ఫిబ్రవరి 9న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో 1-19 సంవత్సరాల వయస్సుగగల పిల్లలందరికి నులిపురుగుల నివారణ మాత్ర అల్బెండజోల్ మాత్ర ఇవ్వాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు గర్భిణీలు వచ్చి చికిత్సలు చేయించుకునేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా పల్స్‌పోలియో, జాతీయ నులిపురుగుల నిర్మూలణ దినం పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జలపతినాయక్ మాట్లాడుతూ దేశం నుండి పోలియోను పాలద్రోలేందుకు ప్రతీ ఒక్కరు 0-5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. జనవరి 28న జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవంద సందర్భంగా జిల్లాలో పెద్ద ఎత్తున పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో 0-5 సంవత్సరాల వయస్సుగల 90284 మంది పిల్లలున్నారని, వీరికి పోలియో చుక్కలు వేసేందుకు 638 పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ బూత్‌లు, 20 మొబైల్ టీంలు, 17 ట్రాన్స్‌డ్ బృంధాలు, 94 మంది సూపర్‌వైజర్లు, 2552 పిపి ఐ బృంధాలు పాల్గొంటాయని ఆయన తెలిపారు. పల్స్‌పోలియో, నులిపురుగుల దినోత్సవం గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ తమ పరిధిలోని పాఠశాలల్లో ప్రతిజ్ఞ సందర్భంగా పల్స్‌పోలియో, నులిపురుగుల నియంత్రణ దినోత్సవం గురించి విద్యార్థులకు తెలపాలని, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ స్వయం సహాయక బృంధాలచే ప్రచారం కల్పించాలన్నారు. పంచాయతీరాజ్‌శాఖ గ్రామపంచాయతీ కార్యదర్శులు ఆర్టీసీ బస్సులపై, బస్టాండ్‌లలో ప్రచారం కల్పించాలని ఆయన కోరారు. ఫిబ్రవరి 9న నిర్వహించు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా అల్బెండజోల్ మాత్రలు ఇవ్వబడునని ఎవరైనా తప్పిపోతే మళ్లీ 15న ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సురేష్, డి ఈవో ఫ్రణీత, డీపీ ఆర్‌వో కలీం, ఐసీడీ ఎస్ విజయలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి విజయ్‌కుమార్, బీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కడెంను సందర్శించిన యూపీపీఎస్సీ సభ్యులు
కడెం,జనవరి 20: నిర్మల్ జిల్లాలోని మండల కేంద్రమైన కడెంకు శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చెందిన యుపీపీ ఎస్సీ సభ్యులు గజేంధర్‌సింగ్, రావత్, సంజయ్‌రావత్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా కడెం హరిత రిసార్ట్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ తాము 60 రోజుల స్టడీ టూర్‌లో భాగంగా ఈరోజు కడెంను సందర్శించడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్శనలో బాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుపై మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలపై తాము తెలుసుకుని, ఈ పథకాలపై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. వారివెంట కలెక్టరేట్ లైజన్ ఆఫీసర్ సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.