అదిలాబాద్

బాసర క్షేత్రానికి వసంత శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర,జనవరి 20: ప్రసిద్ద పుణ్యక్షేత్రం చదువులతల్లి కొలువైన బాసర అమ్మవారి క్షేత్రం వసంతశోభను సంతరించుకుంది. మూడు రోజులపాటు అమ్మవారి సన్నిధిలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం ఉదయం 4 గంటలకు ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లకు అభిషేక సేవతో ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ యాగ మండపంనందు ఇంచార్జి ఈవో ఎ.సోమయ్య, ఆలయ ఛైర్మెన్ శరత్‌పాఠక్, పాలకవర్గ సభ్యులు మహా సంకల్ప పూజ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండేకాక మహారాష్ట్ర నుండి భక్తులు అమ్మవారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. వసంతపంచమి మాగశుద్దపంచమి రోజున నిర్వహించేందుకు భారీసంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్‌లు, షామియానాలు ఆలయ అధికారులు ఏర్పాటుచేశారు. సరస్వతిదేవి అమ్మవారిచెంత అన్నదాన క్షేత్రం పర్వదినాన అమ్మవారిచెంత అక్షరస్వీకార పూజలు జరిపిస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతులవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతీయేట మాగశుద్ద పంచమి శ్రీపంచమిగా బాసరలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈనెల 22 సోమవారం రోజున శ్రీ పంచమి వేడుకలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లను చేశారు. ఉదయం అమ్మవార్లకు విశేష అభిషేక పూజలు నిర్వహించి ఉదయం 5 గంటల నుండి అక్షరాభ్యాస పూజ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా అక్షరాభ్యాస పూజలు నిర్వహించేందుకు అర్చకులను అందుబాటులో ఉంచారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సకల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
నేటి పూజా కార్యక్రమ వివరాలు
స్థాపిత దేవతా హోమం, చంఢీ పారాయణం, మహా విద్యాపారాయణం పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు.

వైద్య మంత్రి లక్ష్మారెడ్డి
నేడు జిల్లాకు రాక
ఆదిలాబాద్ టౌన్,జనవరి 20: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు తెలంగాణ వైద్య మరియు ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండారి కృష్ణ, వామన్‌రావులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్‌లో ఉదయం 11 గంటలకు తెలంగాణ వైద్య మరియు ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం అధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీని మంత్రి ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. కావున సంఘ సభ్యులు, వైద్య ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.