అదిలాబాద్

బార్‌కు, బెంచ్‌కు మధ్య విడదీయలేని బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 20: న్యాయ స్థానాల్లో బార్‌కు, బెంచ్‌కు మద్య విడదీయలేని అనుబంధం ఉంటుందని, కోర్టుల్లో పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేందుకు రాజీమార్గం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి జస్టిస్ శ్యాంప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన జూడిషియల్ కాన్ఫరెన్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు బార్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన స్వచ్చ్భారత్ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా కోర్టు ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డి.దివ్య, జిల్లా న్యాయమూర్తులతో కలిసి హైకోర్టు జడ్జి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన జూడిషియల్ కాన్పరెన్స్‌లో పాల్గొన్న హైకోర్టు జడ్జి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన న్యాయమూర్తులతో పాటు వివిధ కోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తులకు నైపుణ్యత ఎంతో అవసరమని, జూడిషియల్ కాన్ఫరెన్స్ ద్వారా న్యాయవ్యవస్థలో కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సామాజిక బాధ్యతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చ్భారత్ కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బార్ అసోసియేషన్ అధ్వర్యంలో న్యాయవాదులు సైతం ముందుకు వచ్చి హరితహారంతో పాటు స్వచ్చ్భారత్ కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల అభినందించారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలందరూ సామాజిక బాధ్యతగా భాగస్వాములు కావాలని న్యాయమూర్తి శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించడం జరుగుతుందని పేర్కొన్నారు. స్వచ్చ్ భారత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ఆదిలాబాద్ జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు చెంతకు చేర్చేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పెండింగ్‌లో కేసు ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూపేలా కృషి చేయాలన్నారు. న్యాయవాదులు, బెంచ్‌కు మద్య దగ్గరి సంబంధం ఉంటుందని, రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి.దివ్య, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఎస్సీ ఎస్టీకోర్టు న్యాయమూర్తి భరతలక్ష్మి, లీగల్‌సెల్ కార్యదర్శి జీవన్‌కుమార్, మూడో అదనపు న్యాయమూర్తి వెంకటేశ్వర్లు, పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నాగోబా సన్నిధిలో ’మండగాజుల‘ పూజలు

*గోవాడలో మెస్రం వంశస్తుల సంప్రదాయ మొక్కులు* నాగోబాను దర్శించుకున్న గిరిజన
సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్
ఆదిలాబాద్,జనవరి 20: కెస్లాపూర్ నాగోబా జాతరకు రోజు రోజుకు భక్తుల ప్రవాహం పెరుగుతూనే ఉంది. శుక్రవారం గిరి దర్బార్ ముగిసినప్పటికీ అంతకంటే ఎక్కువ సంఖ్యలో శనివారం భక్తులు తరలిరావడంతో కెస్లాపూర్ జాతర ప్రాంగణం కిటకిటలాడింది. మెస్రం వంశస్తులు, ఆదివాసీ గిరిజన తెగల భక్తులు తమ సాంప్రదాయ పూజలు, విన్యాసాలతో ముగింపు క్రతువుతో జాతర ఉత్సవాల ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. శనివారం ఎడ్లబండ్లు, వాహనాలు, ఆర్టీసి బస్సుల్లో వేలాది భక్తులు తరలిరావడంతో జాతర ప్రాంగణం సందడి కనిపించింది. ఈ రెండు రోజుల్లోనే జాతరకు తరలివచ్చిన భక్తులతో వ్యాపారం బాగాసాగిందని చిరు దుకాణాల వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే శనివారం సాంప్రదాయ పూజల ముగింపు సంధర్భంగా మెస్రం వంశ పెద్దలు, కటోడీలు తమ ఆచార ఆనవాయితీలో భాగంగా గోవాడ వద్ద ప్రదర్శించిన మండగాజుల విన్యాసాలు విశేషంగా అలరించాయి. జాతరకు వచ్చిన జనం విన్యాసాలను ఆసక్తిగా తిలకిస్తూ తమ సెల్‌ఫోన్‌లో బందించడం కనిపించింది. శనివారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్ దత్త, ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య నాగోబాను దర్శించుకొని జాతర విశేషాలపై ఆరా తీశారు. దర్బార్ ప్రశాంతంగా జరగడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 22 వరకు జాతర ఉత్సవాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల స్టాళ్ళ ప్రదర్శన మాత్రం మొక్కుబడిగానే కనిపించింది. దర్బార్ అనంతరం అధికారులు, సిబ్బంది జారుకోగా పోలీసు బందోబస్తు సైతం తగ్గించారు. ఇదిలా ఉంటే గిరి దర్బార్‌లో మొత్తం 18 కౌంటర్లు ఆర్జీల కోసం ఏర్పాటు చేయగా 12వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చినట్లు, వీటిలో 90 శాతం పైగా లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే ఏకైక డిమాండుతో ఆర్జీలు రావడం గమనార్హం. కాగా ఆదివారం సెలవుదినం కావడంతో జాతరలో జనం తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.