అదిలాబాద్

ఆదివాసీ గిరిజనుల్లో హక్కులపై చైతన్యం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 23: అమాయకంగా జీవనం సాగించే ఆదివాసీ గిరిజనులు ప్రశ్ని ంచే తత్వాన్ని అలవర్చుకొని హక్కుల పరిరక్షణకు చైతన్యవంతులు కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. మం గళవారం ఆదిలాబాద్ మండలం మారుమూల మామిడిగూడ గిరిజన గ్రామంలో జిల్లా న్యాయసేవా సాధికారిక సంస్థ అధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, జిల్లా కలెక్టర్ డి.దివ్య, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌లు హాజరుకాగా వారికి గ్రామస్తులు సాంప్రదాయడోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు, నిరక్షరాస్యులకు హక్కుల గురించి వివరించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి నెలకొక్కసారి మారుమూల గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి, చట్టాలు, హక్కుల గురించి అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వ అధికారులతో వివిధ పథకాలపై అవగాహన కల్పించి, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకునేలా, సబ్సిడీ రుణాలు అందే విధంగా వారిని చైతన్యపరుస్తామని అన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మద్య వారదిగా న్యాయ విజ్ఞాన సదస్సులు ఎంతగానో దోహదపడుతాయని ఆమె పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ దివ్య మాట్లాడుతూ ఆదివాసీల్లో ఇప్పటికీ అమాయకత్వం కనిపిస్తుందని, వారిలో ప్రశ్నించే తత్వం వచ్చేవరకు అభివృద్ది ముందుకు సాగదని అ న్నారు. హక్కుల పట్ల, ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెరగాలని, లబ్దిదారులు తమకు అందే రాయితీ పథకాల గురించి ఎప్పటికప్పు డు తెలుసుకుంటూ ఉండాలన్నారు. ప్రభుత్వా లు అందిస్తున్న పథకాలను సద్వినియోగంచేసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఉట్నూరు సదస్సు లో గిరిజనులు వినతి పత్రాలు ఇస్తున్నారే త ప్పా తమ సమస్య ఏమిటన్నది చెప్పడం లే దని, వారిలో ధైర్యంగా మాట్లాడే తత్వం రావాలని అన్నారు. గిరిజనులంటే తనకు ఎంతో అభిమానమని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలివ్వడం లేదని,ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో కొందరికి వన్‌బి పత్రాలు అందజేసినప్పటికీ పహాణీల్లో నమోదు చేయడం లేదని గిరిజనులు కలెక్టర్‌కు విన్నవించారు. వంద సంవత్సరాలుగా పోడు భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి రాయితీ రుణాలు అందడం లేదని, ముఖ్యంగా పట్టాలు కూడా ఇవ్వడం లేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. చట్టపరిదిలో వాటిని పరిష్కరించేలా కృషి చేస్తామని, వైద్యాధికారులు, ఏజెన్సీ అధికారులు గిరిజనులకు అందించే మెడికల్, ఏజెన్సీ ధృవీకరణ పత్రా లు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. మార్చి నెల వరకు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ని ర్మించుకునేలా చూడాలని అన్నారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే నేరాల సం ఖ్య తగ్గుముఖం పడుతుందని అన్నారు. ఇలాంటి న్యాయ విజ్ఞాన సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. గిరిజనులకు ఉచిత శిక్షణ కల్పిస్తామని అన్నారు. న్యాయ విజ్ఞాన సంస్థ జిల్లా కార్యదర్శి జీవన్ కుమార్, డిఎస్పీ నర్సింగ్ రెడ్డి, డిటిడివో సుశీల, ఏపివో జనరల్ నాగోరావు, డిఎంఆండ్‌హెచ్‌వో రాజీవ్ రాజ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ సింగ్, పిపి రమణ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాంబాయి తదితరులు పాల్గొన్నారు.