అదిలాబాద్

రైతు అధ్యయన యాత్రలపై చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోథ్,జనవరి 23: నేడు నిర్మల్ జిల్లాకేంద్రంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల తెలంగాణ విద్యావంతుల వేదిక సమావేశానికి ఐకాస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారని ఆదిలాబాద్ టివివి జిల్లా సమన్వయ కర్త రావుల శంకర్ అన్నారు. మం గళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ జె ఏసి పిలుపు మేరకు గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్, ని ర్మల్ జిల్లాల్లో టివివి అధ్వర్యంలో చేపట్టిన రైతు ఆధ్యయన యాత్రల్లో క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న బాధలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించామని, సమస్యలను, విధి విధానాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏలాంటి లాభం చేకూర్చకపోగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని విమర్శించారు. ఎకరానికి రూ.4వేలు అందించే పథకం కేవలం ఓటు బ్యాంక్ కోసమేనని, దాని వలన రైతులకు ఏలాంటి లాభం చేకూరదని ఆయన అన్నారు. ఎకరానికి 30వేల పైచిలుకు ఖర్చుకాగా రూ.4వేల ఏవిధంగా ఇస్తారని ఆయన విమర్శించారు. త్వరలో నిర్వహించనున్న ఎలెక్షన్లలో రైతులను మభ్యపెట్టేందుకే ఈ పథకం ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. కాని రైతులు, నిరుద్యోగులు, మేధావులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధి విధానాల పట్ల పూర్తి వ్యతిరేక కనబరుస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్దిచెబుతారని, కాగానిర్మల్‌లో జరిగే సమావేశానికి పెద్ద ఎత్తున రైతులు, మేధావులు, నిరుద్యోగులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట టివివి సభ్యులు ప్రసాద్, గంగారాం, సదాశివ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.