అదిలాబాద్

ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు64వ జన్మదిన వేడుకలు నగరంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. కేకులు కోసి, మిఠాయిలు పంచి పెట్టారు. అనాథ,వృద్ధాశ్రమాలు, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. తెలంగాణ చౌక్‌లో టీఆర్‌ఎస్ నాయకుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలోనిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, ఎమ్మెల్యే కమలాకర్ పాల్గొని, భారీ కేకు కోసారు. టవర్ సర్కిల్‌లో మేయర్ యువసేన అధ్యక్షుడు జి.హెచ్.ప్రసాద్ నేతృత్వంలోకేకు కోసి, మిఠాయిలు పంచారు. ప్రతిమ మల్టిప్లెక్స్‌లోసింగ్ యువసేన ఆధ్వర్యంలోకేసీఆర్ ఫోటోతోప్రత్యేకంగా తయారుచేయించిన కేకును ఎంపి వినోద్‌కుమార్‌తో కలిసి మేయర్ రవీందర్‌సింగ్ కోసి, సంబురాలు చేసుకున్నారు. ఈసందర్భంగా ఎంపి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించటం వెనుక ఆయన చేస్తున్న అభివృద్ధి దాగి ఉందని అన్నారు. ప్రజా సంక్షేమ దృష్ట్యా సీఎం వచ్చే ఏడాది బడ్జెట్ రూపకల్పన కోసం హైద్రాబాద్‌లో అధికారులతో సమావేశమయ్యారని అన్నారు. తన సమయాన్నంతా తెలంగాణ అభివృద్ధి కోసమే వెచ్చిస్తున్న కేసీఆర్ తన చిరకాల స్వప్నమైన బంగారు తెలంగాణ కల సాకారం చేసేందుకు అలుపెరుగని కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ గడ్డపై ఆయన జన్మించటం మూడున్నర కోట్ల ప్రజల అదృష్టమని, ప్రతి ఎకరాకు సాగునీటితో పాటు తాగు నీరందించి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. టిఆర్‌ఎస్వీ జిల్లా నాయకుడు పొన్నం అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు,పాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రధాత, బంగారు తెలంగాణ ఆవిష్కర్త ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుదీర్ఘపాలనతో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్‌లోవిద్యార్థులతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించి, విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం యావత్ తెలంగాణ ప్రజానీకానికి పండుగ అని కొనియాడారు. ఈకార్యక్రమంలోగ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, కార్పోరేటర్లు సాదవేని శ్రీనివాస్,యాదగిరి సునీల్‌రావు, ఎండి అరిఫ్, నాయకులు మైకేల్ శ్రీను, ప్యాట సురేశ్,ఎడ్ల అశోక్,కర్ర సూర్యశేఖర్, కత్తి శ్రీనివాస్, కులదీప్, వంశీకృష్ణ,రమేశ్, మోహన్, నర్సింహా, అశోక్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

కేసీఆర్‌కు జడ్పీ చైర్‌పర్సన్
జన్మదిన శుభాకాంక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 17: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు దంపతులు కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

చేనేత పారిశ్రామికులకు చేనేత మిత్ర పథకం
* ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
* హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డైరెక్టర్ శైలజారామయ్యర్

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 17: చేనేత పారిశ్రామికుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ప్రభుత్వం చేనేత మిత్ర పథకం (40శాతం నూలు సబ్సిడీ పథకం) ప్రవేశపెట్టిందని డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ శైలజారామయ్యర్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని చేనేత పారిశ్రామికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని చేనేత పారిశ్రామికులతో ఈ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన 40శాతం నూలు సబ్సిడీ పథకం మొక్క విధి విధానాలు, చేనేత పారిశ్రామికుల నూతన త్రిప్టు ఫండ్ పథకం (నేతన్నకు చేయూత)పై అవగాహన కల్పించారు. రుణమాఫీపై చేనేత పారిశ్రామికులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తూ ఆ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, పూర్తి చేసే పనిలో హ్యాండ్లూమ్స్ టెక్స్‌టైల్స్ సంస్థ నిమగ్నమై ఉందని అన్నారు. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ చేనేత మిత్ర పథకంలో ప్రభుత్వం 40శాతం సబ్సీడీ ఇస్తున్న దృష్ట్యా దీనిపై ప్రతి చేనేత పారిశ్రామికుడు దృష్టి సారించి రిజిష్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో టెస్కో జనరల్ మేనేజర్ పి.యాదగిరి, చేనేత, జౌళి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు ఎం.వెంకటేశం, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల చేనేత పారిశ్రామికులు తదితరులు పాల్గొన్నారు.

20న ఆర్మీలో ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు
* ఉమ్మడి జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలి
* కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పిలుపు

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 17: వచ్చే మే మాసంలో వరంగల్ జిల్లాలో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికయ్యేలా ఈ నెల 20న కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆర్మీలో ఉన్న ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ అవగాహన సదస్సులో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ పవర్ పూరీ పాల్గొంటారని, ఆర్మీలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై ఆయన పూర్తి సమాచారం అందిస్తారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని యువకులు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొనాలని సూచించారు. 8వ తరగతి నుండి ఇంటర్, బిఎస్సీ నర్సింగ్, ఎల్‌ఎల్‌బి, ఇంజనీరింగ్ విద్యా భ్యాసం చేసిన వారు వివిధ విభాగాల్లో ఆర్మీలో చేరవచ్చని తెలిపారు. ఫీజికల్ ఫిట్‌నెస్‌లో ఎన్‌సీసీ విద్యార్థులు ఒక బ్యాచ్‌లాగా తీసుకుని శిక్షణ ఇస్తారని అన్నారు. అలాగే వారధిలో నమోదు చేసుకున్న అభ్యర్థులకు వారధి ద్వారా కూడా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆర్మీలో మంచి అవకాశాలున్నాయని, నిరుద్యోగ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి లెప్ట్‌నెంట్ ప్రవీణ్‌కుమార్, వారధి సోసైటీ కార్యదర్శి ఆంజనేయులు, సైనిక సంక్షేమశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాసారు మాకే కావాలి
* రోడ్డెక్కిన దమ్మన్నపేట విద్యార్థులు
గంభీరావుపేట, ఫిబ్రవరి 17: మాసారు మాకే కావాలంటూ గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ప్రాధమిక పాఠశాల విద్యార్థులు శనివారం రోడ్డెక్కి నిరసన తెలిపారు.