అదిలాబాద్

ప్రమాద సంఘటన స్థలం వద్ద విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోథ్, ఏప్రిల్ 15: కన్గుట్ట సమీపంలోని వంతెన పైనుండి గురువారం ఆటో బోల్తా పడి ఆరుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కాగా సంఘటన స్థలాన్ని శుక్రవారం ఆదిలాబాద్‌కు చెందిన డిప్యూటి మోటార్‌వెహికిల్ అధికారి శ్రీనివాస్ అధ్వర్యంలో పోలీసు అధికారులు పరిశీలించారు. ప్రమాదంకు గల కారణాలపై ఆరా తీయడంతో పాటు నూతనంగా కొనుగోలు చేసిన వాహనం కావడంతో ఆటోను పరిశీలించారు. ప్రమాదంకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లు కిషోర్ చంద్ర, వివేకానంద రెడ్డిలు ఉన్నారు.
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే బాపురావు
ఆటో బోల్తాపడి ప్రమాదానికి గురైన వారి కుటుంబాలను శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శించారు. ప్రమాదంకు గల కారణాలను తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరుపున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ నాయకులు దేవయ్య, రమణ, రుక్మాన్‌సింగ్, మల్లేష్ తదితరులు ఉన్నారు.