అదిలాబాద్

ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, మార్చి 23: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఉపాధి ఉ ద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఉట్నూరు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక కుమురంభీం ప్రాంగణంలోని వైటిసి లో జాబ్ మేళాను పోలీసులు, ఐటిడిఏ అధ్వర్యంలో నిర్వహించగా, వివిధ కంపెనీల ప్రతినిధులతోపాటు నిరుద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు లేవని చింతించకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతోనే ఉపాధి లభిస్తుందని అనుకోవడం సమంజసం కాదని, ఏ అవకాశం లభి ంచినా దానిని ఉపయోగించుకోవాలన్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ని రుద్యోగ యువతకు ఎన్నోరకాల శిక్షణతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందున చెడు అలవాట్లకు వెళ్ళకుండా కుటుంబ సంక్షేమం కోసం ఉపాధి మార్గాల్లోరాణించాలన్నారు. అనంతరం పలువురు నిరుద్యోగుల ధృవపత్రాలను పరిశీలించారు. శనివారం ఇచ్చోడలో ఉద్యోగ మేళా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్సై సాయన్నతోపాటు పలువురు ఐటిడిఏ ఉద్యోగులు పాల్గొన్నారు.