అదిలాబాద్

మహిళల భద్రత కోసం షీ టీంలతో గస్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మార్చి 23: పోలీసు వ్యవస్థను పటిష్టంచేస్తూ మహిళల భద్రత కోసం ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తున్నామని, మహిళా పోలీసుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా ఆధునాతన వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. శుక్రవారం పోలీసు పరేడ్ మైదానంలో హిరో మోటర్ హైదరాబాద్ రీజినల్ మేనేజర్ కమల్ కరంచంద్‌తో కలిసి 20 డ్యూట్ మోడల్ ద్విచక్ర వాహనాలను ఎస్పీ, ఆయన సతీమణి అందజేశారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొత్తగా విధుల్లో చేరిన షీటీం పోలీసులు మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలను నిరోదించేందుకు అంకితభావంతో సేవలందించాలని అన్నారు. మహిళల రక్షణ, పోలీసు వ్యవస్థ పటిష్టం చేసేందుకే షీటీంలకు ద్విచక్ర వాహనాలను అందజేస్తున్నామని, తద్వారా వారిలో నూతన ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. రెయింబవల్లు శ్రమిస్తున్న పోలీసులను ప్రోత్సహించడంతో పాటు వారిలో మనోధైర్యం పెంచేందుకు అనేక సంస్కరణలు అమల్లో తెస్తున్నామన్నారు.