అదిలాబాద్

కారుణ్య నియామకాలపై మెడికల్ బోర్డు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, మార్చి 23: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ముఖ్య మంత్రి ఇచ్చి హామీలను వెంటనే అమలు చేయాడానికి యాజమాన్యం సిద్దమైయిందని సంస్థ చైర్మన్ ఎన్ శ్రీ్ధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఫిబ్రవరి 27న శ్రీరాంపూర్ ఆత్మీయసభలోప్రకటించిన సింగరేణి కార్మికులకు కారుణ్యనియమకాలు వెంటనే అమలు, రిటైర్డ్ కార్మికులకు వైద్యం, కొత్త క్వార్టర్ల నిర్మాణం హామీలపై యాజమాన్యం సర్యూలర్ జారీచేయడం జరిగిందని తెలిపారు. మిగతా హామీలపై సంబంధిత ప్రభుత్వ శాఖలతో సంప్రదింపు లు నిర్వహిస్తూన్నామని పేర్కొన్నారు. కారుణ్య నియమకాలపై కొత్తగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించగా దీనిపై యాజమాన్యం తక్షణ మే స్పందిస్తు మార్చి 9న కారుణ్య ని యమకాలపై సవరించి సర్య్కూలర్ జారీ చేయడం జరిగిందన్నారు. కార్పోరేట్ మెడికల్ బోర్డును పునర్ వ్యవస్థీకరించి వచ్చేవారం నుండి క్రమంతప్పకుండా మెడికల్ బోర్డు స మావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సిఎం ఆదేశాలమేరకు కార్మికులకు నీటిబిల్లు, విద్యుత్ బిల్లు లు చెల్లింపునుండి పూర్తిగా మినహాయింపు ఉత్తర్వులు విడుదల చేయడం జరిగిందన్నారు.
కార్మికులకు కొత్తగా మరో 10వేల క్యార్టర్ల నిర్మాణానికి సివిల్‌శాఖతో సమావేశం నిర్వహించి క్వార్టర్ల దశల వారీ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిందని, దీనికి రూ. 100కోట్ల నిధులను ప్రభుత్వ విడుదల చేసిందని అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోసింగరణి స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి ఇంటి పట్టాలను అందించేందుకు సంబంధిత జిల్లాకలెక్టర్‌తో చర్చించి అటవీశాఖకు చెందిన భూ ములు అయినందున వాటిని ఢీ- రీజర్వు చేయడానికి జిల్లాకలెక్టర్ ద్వారా సంబంధిత ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాలని కోరామన్నారు.
సింగరేణిలో పదవీ విరమణ పొందిన కార్మికులకు పెన్షన్ పెంచాడానికి అన్ని చర్యలు తీసుకొవడం జరుగుతుందని పేర్కొన్నారు. నెలవారి పెన్షన్ రు. 350 నుండి రూ. 8 వేల వరకు పెంచాలని, సంబంధిత మం త్రిత్వ శాఖ అనుమతులను పొందాడానికి తగు చర్యలు తీసుకోవాలనికోరామన్నారు.
రిటైర్డ్ కార్మికులకు ఉచిత వైద్యం కోసం సర్య్కూలర్ జారీచేయడం జరిగిందని తెలిపారు.