అదిలాబాద్

మావోల ఇలాకాలో ఎస్పీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్17: మావోయిస్టుల కంచుకోటగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం డెడ్రా మారుమూ ల గిరిజన గ్రామాన్ని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మంగళవారం సందర్శించారు. రహదారి సౌకర్యం అంతగా లేని ఈ గ్రామానికి పోలీసు బృందాలతో కలిసి వెళ్ళిన ఎస్పీకి డెడ్రా గ్రామంలో సమస్యలు స్వాగతం పలికాయి. ఈ గిరిజన గ్రామంలో 90 కుటుంబాలు ఒకే నీటిబావిని ఉపయోగించుకుంటూ తాగునీటి సమస్యతో సతమతమవుతుండగా వారికి శుద్దజలం అందించాలన్న సంకల్పం మేరకు అప్పటి ఎస్పీ ఎం.శ్రీనివాస్ శంఖుస్థాపన చేయగా మంగళవారం కొత్త ఎస్పీ విష్ణు వారియర్ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు రక్షిత మంచినీటిని వాడుకోవాలని ఎస్పీ సూచించారు. అయితే ఈ గ్రామానికి చెందిన దాసరివాడ్ సుమన అలియాస్ సంగీతక్క 18 ఏళ్ల కిందటే మావోయిస్టు పార్టీలోకి వెళ్లిపోగా ప్రస్తుతం చత్తీస్‌ఘడ్‌లోని దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్న విషయాన్ని ఎస్పీ గుర్తించారు. వెంటనే ఎస్పీ వారి ఇంటికి వెళ్ళి సంగీతక్క తల్లి అంజనబాయి, కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అ యితే వారు దీన స్థితిలో ఉన్నారని, కుటుంబ జీవనం సాఫీగా సాగడం లేదని ఎస్పీకి వివరించగా వారికి మూడు నెలల సరిపడు బి య్యం, పప్పుదినుసులు, నిత్యావసర సరకు, నూనె, బట్టలను ఎస్పీ అందజేశారు. వారిని అక్కునచేర్చుకొని కాసేపు ముచ్చటించారు. సంగీతక్క లొంగిపోతే బాగుంటుందని కు టుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎస్పీ విష్ణు వా రియర్ ఈసంధర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టి లొంగుబాట్లను ప్రొత్సహిస్తుందని, అడవుల్లో ఉండి నక్సలైట్లు ఏమి సాధించలేరని అన్నా రు. డెడ్రా గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు సెల్‌టవర్ కల్పించాలని గ్రామస్తులు కోరగా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు. నక్సలైట్లు వెంటనే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అనంతరం డెడ్రా పాఠశాలలో చదువుకుంటున్న 26 మంది విద్యార్థులకు యూనిఫాంలను ఎస్పీ అందజేసి వారితో ముచ్చటించారు. విద్యార్థులు మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలుసుకోవడానికి పుస్తకాలు ఇవ్వాలని ఎస్పీని పిల్లలు కోరారు. అనంతరం బజార్‌హత్నూర్ మండలంలోని బూతాయి గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. బూతాయి గ్రామ పరిసరాలైనా మాన్కాపూర్, దెహెగాం, టెంబి, గిరిజాయి, ఉమ్మడ, దర్మవరి, దవాడి, మడావిగూ డ, మహాదేవ్‌గూడకు చెందిన వెయ్యి మంది గిరిజనులు, గిరిజనేతరులు హాజరై వైద్యపరీక్షలు నిర్వహించుకున్నారు. ఆయా గ్రామాల నుండి పోలీసులు ప్రజలను తీసుకవచ్చి మంచినీరు, భోజన వసతి కల్పించడంతో పాటు వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలందించారు. 200 మందికి కళ్లద్దలు అందించారు. సు మారు రెండు లక్షల విలువైన మందులను ఈ సంధర్భంగా ఎస్పీ పంపిణీ చేశారు. 20 మంది విష జ్వరాలు, రక్తహీనతతో బాధపడుతున్నట్లు నిర్ధారించడంతో వారిని ప్రత్యేకంగా రిమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అం దించారు. కాగా ఎస్పీ మాట్లాడుతూ మా రుమూల గ్రామాల్లోని అర్హత కలిగిన యువతియువకులకు కానిస్టేబుల్ ఎంపిక పరీక్ష కోసం ఉచితంగా ఉన్నత ప్రమాణాలతో శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. గిరిజన ప్రజలకు న్యా యం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. రైతు ఆత్మహత్యల నివారణ కోసం పోలీసు కళాబృందం ప్రదర్శించిన కార్యక్రమాలు అలరించాయి. డిఎస్పీ నర్సింహారెడ్డి, బోథ్ సిఐ జయరాం నా యక్, బజార్‌హత్నూర్ ఎస్సై ఎస్‌ఏ మోబిన్, ఎస్‌బి ఎస్సై మెస్రం చంద్రబాన్ పాల్గొన్నారు.