అదిలాబాద్

విదేశాలు వద్దు.. స్వదేశం ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఏప్రిల్ 17: పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర న్యాయ, దేవాదాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలంలోని బోరిగాం గ్రామంలో పలు అభివృద్ది పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాటశాలలో రూ.6.50 లక్షలతో నిర్మించిన అదనపు గదుల నిర్మాణానికి, రూ.2 లక్షలతో నిర్మించిన కిచెన్‌షెడ్, స్టోర్‌రూమ్, రూ.13.50 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనంకు, రూ. 3 లక్షలతో మున్నూరుకాపుసంఘ భవనం, రూ. 3 లక్షలతో రజక సంఘం భవనాలకు ప్రారంభోత్సవం, రూ.10 లక్షలతో నిర్మించిన వైకుంఠదామంను మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమంతోపాటు అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యే యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బోరిగాం గ్రా మంలో బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 20 లక్షలు, మెటల్ రోడ్డుకొరకు రూ.20 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తుందని, నిరుద్యోగ యువత విదేశాలకు వెళ్లకుం డా స్వదేశంలో ఉండి ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందాలన్నారు. ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా పేద ఆడపిల్లల పెళ్లిల్లకు సహాయం అందిస్తుందన్నారు. కేసీ ఆర్ కిట్ ద్వారా గర్భిణీలకు ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన భోజనం అందిస్తున్నామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి టి.ప్రణీత, సారంగాపూర్ మార్కెట్ కమిటి ఛైర్మెన్ రాజ్‌మహ్మద్, ఎఫ్ ఎసీ ఎస్ ఛైర్మెన్ రాంకిషన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ కమిటి కో ఆర్డినేటర్ నల్ల వెంకట్‌రాంరెడ్డి, టీ ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ ఎర్రవోతు రాజేందర్, సర్పంచ్ పూజరి శ్రీనివాస్, నాగం రా ంరెడ్డి, మానిక్‌రెడ్డి, అడెల్లి దేవస్థానం చైర్మెన్ శ్రీనివాస్‌రెడ్డి, జీవన్‌రావు, నారాయణ, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.