అదిలాబాద్

రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండేపల్లి, మే 22: రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని మంచిర్యాల జిల్లా సంయుక్తపాలనాధికారి సురేందర్‌రావు సూచించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దత్తుప్రసాద్ రావు, ఏఓ కుమార్ యాదవ్‌ను మండల రైతాంగం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైతుబందు పథకంలో ఎంతమంది రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు అందలేదు అని అడిగి తెలుసుకున్నారు. ఇరు శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి రైతుల ఇబ్బందులు తీర్చాలని సూచించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జూన్ రెండో తేదీ నుంచి పాసుపుస్తకాలలో దొర్లినా తప్పులను సరిచేసి అర్హూలైన ప్రతి రైతుకు రైతుబందు వర్తింప చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుబంధు ఏ ఓక్కరోజుతో అగేది కాదని ఇది నిరంతర ప్రక్రియ అని ఏవరి మాటలు నమ్మవద్దని ప్రభుత్వం పూర్తిగా రైతులకు న్యాయం చేసేంతవరకు ఈప్రక్రీయ ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుబందులో చిన్నచిన్న తప్పులు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికి తప్పులను సరిచేసే భూమి ఉన్న ప్రతి రైతుకు చెక్కులు, పాసుపుస్తకాలు అందిస్తామని, కేసులు, మరేదైనా కారణంతో ఉన్న వాటికి మాత్రం అవితోలిగిన తర్వాత అందించడం జరుగుతుందని రైతుసోదరులు సహకరించాలని కోరారు.
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
* సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంతయ్య
దండేపల్లి, మే 22: ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలుమాసు కాంతయ్య అన్నారు. ఇటీవల నూతనంగా ఏన్నికైన వైశ్యసంఘం జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ముక్త శ్రీనివాస్, చెట్ల రమేష్‌లను తాళ్ళపేట వైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించగా దీనికి ముఖ్యఅతిధిగా కాంతయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయంతో పాటుగా ఆర్థికంగా ఎదిగి సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొత్త శ్రావణ్, ఎల్గూరి వేణు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ముస్త్యాల సుజీత్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గడ్డం వికాస్, తాళ్ళపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గుండం శంకరయ్య, కటుక్కం శ్రీనివాస్,దండేపల్లి పట్టణ అధ్యక్షుడు పాత శ్రీనివాస్,నాయకులు కొత్త రవి, అక్కినపెల్లి బుచ్చయ్య,గుండం రాజలింగం,మల్యాల రమణయ్య,సుధాకర్, రమేష్, శివ, మల్లూరి వినోద్, మాదంశెట్టి మల్లిఖార్జున్ పాల్గొన్నారు.