అదిలాబాద్

రాబోయే ఎన్నికల్లో టీడీపీ కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, మే 22: వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందని పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి బుచ్చిలింగం అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పార్లమెం ట్ స్థాయి మినీ మహానాడు ఉట్నూరులో జరగగా ఆయనతో పాటు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు వీరేంద్రగౌడ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాందర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీకి మనుగడ లేదని టీఆర్‌ఎస్ అసత్యపు ప్రచారం చేసుకుంటూ తమ నాయకులను, కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటూ కుటిల రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. తెలుగు దేశం పార్టీ అంటే కేసీఆర్‌కు, ఆ పార్టీ నాయకులకు ఎంతో భయం ఉందన్న విష యం బయటపడుతుందని అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా టిడిపి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో జెడి ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించినట్లే తెలంగాణలో సైతం తమ పార్టీ కింగ్ మేకర్ అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులకు రాజకీయ భీక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారని అన్నారు. తమ పార్టీని వదిలివెళ్ళినవారు టీ ఆర్ ఎస్‌లో ప్రాధాన్యత లేక ఏలా ఉన్నారో జిల్లా మాజీ ఎంపి రాథోడ్ రమేష్‌ను చూస్తేనే తెలుస్తుందని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం టిడిపి పార్టీ ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడి వల్లే రాలేదని, అన్ని వర్గాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాటాలు చేసినప్పుడే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ఏర్పాటు అయిన సమయంలో 18వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల్లోకి చేర్చాడని అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 6.50లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు బంధు పథకాన్ని అమలు చేశారని ఆరోపించారు. ఈ పథకం ద్వారా సన్నకారు, చిన్నకారు రైతులకు ఒరిగిందేమి లేదని, భూస్వాములకు దోచిపెట్టారని అన్నారు. ఇంతపెద్ద పథకం ప్రవేశపెట్టిన కెసిఆర్‌కు కౌలు రైతులు కనిపించలేదా అని ప్రశ్నించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి నాలుగేళ్ళల్లో కేవలం 15వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. రాబోయే పం చాయతీ ఎన్నికల్లో టిడిపి సత్తా ఎంటో తెలుస్తుందని, త్వరలో రాష్ట్ర మహానాడు, జాతీయ మహానాడుకు కార్యకర్తలంతా హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షుడు అల్లూరి రాజారెడ్డి, ఆనంద్, రాష్ట్ర నాయకులు భూషన్‌రెడ్డి, ఓంప్రకాష్, విఠల్, పురుషోత్తం నాయక్, పరుశురాం, అన్నపూర్ణ, రాజేశ్వర్, మురళిధర్‌రావు, అల్లం సురేష్, శ్రీనివాస్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.