అదిలాబాద్

తొలి మున్సిపల్ చైర్మన్ రమణయ్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జూలై 15: పట్టణానికి చెందిన స్వతంత్య్ర సమర యోధుడు తొలి మున్సిపల్ చైర్మన్ కండే వెంకట రమణయ్య(94)అనారోగ్యంతో ఆదివారం పట్టణంలోని తన స్వగృహంలో మృతి చెందారు. స్వాతంత్య్ర సమర యోధునిగా అటుఆంగ్లేయులతో, ఇటు నిజాంతో పోరాడినట్లు చెబుతుంటారు. అప్పట్లో రమణయ్య నాగ్‌పూర్‌లో సాయుధ శిక్షణ పొందారు. మంచిర్యాల మున్సిపాలిటీగా అవతరించిన దరిమిలా 1994లో తొలి మున్సిపల్ చైర్మన్‌గా రమణయ్య ఎన్నికై నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా మూడు పర్యాయాలు పనిచేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పదవీ చేపట్టారు. ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ తరఫున విశేష సేవలందించిన ఆయన జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఒక దఫా లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనసభకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. రమణయ్యకు మద్దతుగా ఆనాడు లక్సెట్టిపేటలో రమణయ్య తరఫున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రచారం చేశారు. రమణయ్యకు ముగ్గురు కుమారులు కేవీ అశోక్, కేవీ ప్రతాప్, కేవీ కిష్టయ్య. వీరిలో ప్రతాప్ న్యాయవాదిగా పనిచేస్తూ బీజేపీలో సీనియర్ నాయకుడిగా సేవలందిస్తున్నారు. రమణయ్య మరణవార్త తెలియగానే విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి, కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, అత్తిసరోజ, జెడ్పీటీసీ ఆశాలత, బిసి నాయకుడు రాజారాం, టిఆర్‌ఎస్ నాయకులు పెంట రాజయ్య, రాచకొండ వెంకటేశ్వర్‌రావు (బుజ్జన్న) భౌతికాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

బీజేపీలో పలువురి చేరిక
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, జూలై 15: జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీవాడ కాలనీకి చెందిన పలువురు ఆదివారం బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధినిచూసి నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలపర్చేందుకు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో బిజెపిలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తగినగుణపాఠం చెబుతారన్నా రు. రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాంపల్లి వేణుగోపాల్, మడావి రాజు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.