అదిలాబాద్

ప్రాణహిత తరలుతున్నా ఎమ్మెల్యేకు పట్టదా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాగజ్‌నగర్, జూలై 15: ఐదు నియోజకవర్గాలకు వరప్రదాయినిగా ఉన్న ప్రతిష్టాత్మకమైన ప్రాణహిత ప్రాజెక్ట్‌ను ఇక్కడ నుంచి తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వార్తలు వసున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు వౌనంగా ఉన్నారని తాలుకా నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఘాటుగా ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కోనప్ప ఆనాడు ప్రాణహిత ప్రాజెక్ట్ కోసం కాలువకు అడ్డంపడి, ప్రాజెక్ట్ నిర్మాణానికి తాను ముందుంటానన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. ఆదివారం స్థానిక ప్రజాకార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో హరీష్‌బాబు మాట్లాడుతూ 2008లో అప్పటి వైఎస్‌ఆర్ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత సృజల స్రవంతి ప్రాజెక్ట్‌కు భూమి పూజ చేశారన్నారు. ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇక్కడ నీటి లభ్యత తక్కువగా ఉందనే సాకుతో కాళేశ్వరానికి ఈ ప్రాజెక్ట్‌ను తరలించారన్నారు. ప్రాణహిత నుండి వైఎస్‌ఆర్ పేరును, బీఎస్పీ పార్టీపై గెలిచి అంబేద్కర్ అశయాల కోసం పనిచేస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు అంబేద్కర్ పేరును తొలగించి ప్రాజెక్ట్‌ను తరలించినా స్పందించకపోవడం దారుణ మన్నారు. కేవలం కాళేశ్వరం కోసమే ప్రాణహితను వార్థా నదీపై నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయని, ఇది కేవలం తూర్పు జిల్లా ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాల ప్రజలను మభ్యపెట్టేందుకేనని ఆయన విమర్శించారు. ఉమ్మడి జిల్లా రైతాంగానికి వరప్రదాయని అయన ప్రాణహిత వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు రైతాంగాన్ని కూడగట్టుకుని అందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. మంగళవారం దహెగాం మండలంలో, 23న బెజ్జూర్ మండలంలో అఖిలపక్షం అధ్వర్యంలో ప్రాణహిత సాధన సమితి ఆధ్వర్యంలో అందోళనలు తీవ్రతరం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు సిలువేరు కమలాకర్, సిందం శ్రీనివాస్, సిలువేరు శ్యాం, దెబ్బటి శ్రీనివాస్, దయాకర్, విఠల్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.