అదిలాబాద్

రిమ్స్‌లో కార్పొరేట్ తరహా వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, జూలై 15: మారుమూల జిల్లాగా పేర్గాంచిన ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుందని, జిల్లా కేంద్రంలో రిమ్స్‌లో కార్పొరేట్ తరహా వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో పేద ప్రజలకు మేలుచేకూరనుందని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. రిమ్స్ లో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డిశ్చార్జ్ అవుతున్న ఇద్దరు రోగులను మంత్రి ఆదివారం కలుసుకొని వారికి అందిన వైద్య సేవలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో వైద్యం కోసం నాగపూర్, హైదరాబాద్‌కు వెళ్ళేవారని, ప్రస్తుతం రిమ్స్‌లోనే కార్పొరేట్‌స్థాయి వైద్యం అందు తుందన్నారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలకు అన్ని వైద్య సేవలు స్థానికంగా పొందే అవకాశం ఉంటుందన్నారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ రిమ్స్‌లో చేరిన లక్ష్మణ్, గఫార్ అనే ఇద్దరికి కోత, కుట్టు లేకుండా ట్రఫ్ అనే అధునాతన పద్దతిలో శస్తచ్రికిత్స చేసి డిశ్చార్జి అవుతున్నారన్నారు. అనంతరం రూ.6లక్షల వ్యయంతో నూతనంగా కొనుగోలు చేసిన చెత్త తొలగింపు మిషన్ స్కార్బ్, వాటర్ జెట్‌లను మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, డిసిసిబి చైర్మన్ దామోదర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, ఐసిడిఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి, సర్పంచ్ రఘుపతి, రిమ్స్ ఇన్‌చార్జి డైరెక్టర్ అశోక్‌తోపాటు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.