అదిలాబాద్

సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, జూలై 17: పట్టణంలోని వ్యాపారస్తులు తమ కిరాణ షాపులు, వస్తద్రుకాణాలలో, ఇండ్లలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసుకోవాలని బెల్లంపల్లి ఏసిపి బాలు జా దవ్ వ్యాపారస్తులకు సూచించారు. మంగళవారం సా యంత్రం పట్టణంలోని పద్మశాలి భవన్‌లో నిర్వహించిన సదస్సుకు హాజరై మాట్లాడా రు. రామగుండం కమిషనర్ విక్రం జిత్ దుగ్గల్, మంచిర్యా ల డిసిపి వేణుగోపాల్‌రావు ఆదేశాల మేరకు నిఘా నేత్రం మేము సైతం అనే అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో దొంగతనాలను అరికట్టేందు కు వ్యాపారస్తులు తమ షాపులలో, ఇండ్లలో నిఘానేత్రాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాలను అమర్చుకుంటే దొంగతనాలను ఆరికట్టవచ్చన్నారు. ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానాన్ని అమలు పరుస్తుందన్నారు. అతితక్కువ ధరకే సిసి కెమెరాలను అమర్చేందుకు అన్నివిధాల సహాయ సహాకారా లు అందిస్తామని తెలిపారు. దొంగతనాలులేని పట్టణంగా బెల్లంపల్లిని తీర్చిదిద్దాలని ఏసిపి సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాపారస్తులకు అన్నివిధాల సహకరిస్తామని తెలిపారు. పట్టణంలోని వ్యాపారస్తులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ సదస్సులో 1టౌన్ ఇన్‌స్పెక్టర్ బీ.రాజు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు
* జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్
మంచిర్యాల, జూలై 17: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా దరఖా స్తు చేసుకున్న అభ్యర్థులకు నేడు (18న) ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఐటిఐ ప్రాగంణంలోని జిల్లా పరిశ్రమల కేంద్రంనందు ఇంటర్వ్యూలు నిర్వహించబడునని పరిశ్రమల జనరల్ మేనేజర్ కే.సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇంటర్వ్యూలకు వచ్చేటప్పుడు ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ప్రాజెక్ట్ రిపోర్టు, విద్యార్హత పత్రాలు, కులం సర్ట్ఫికేట్‌లు తీసుకురావాలని తెలిపారు.