అదిలాబాద్

కమీషన్‌ల కోసమే ప్రాజెక్ట్‌ల మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, జూలై 17: ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో ముఖ్యమ ంత్రి ఇచ్చిన వాగ్దానాలను అమలు చే యడంలోపూర్తిగా విఫలమయ్యారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి ఆరోపించారు. మంగళవారం తన నివాసంలో వివిధ పార్టీల నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదీపై ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా 50 టిఎంసిల నీటితో 5 లక్షల కు ఎకరాలకు నీరు అందిస్తామని చె ప్పిన కేసిఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాల ప్రజలను నిలువునా మోసం చే శారని విమర్శించారు. ప్రాణహిత నదీపై ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా 50 టిఎంసిల నీటితో 5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పిన కేసిఆర్ ప్ర జలను మోసం చేస్తున్నారన్నారు. కేవలం కమీషన్‌ల కోసమే ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ వార్ధా నదీపైకి మార్చారని ఆ రోపించారు. గోదావరి, కృష్ణా, నదుల అనుసంధానం చేసి పోలవరం ప్రా జెక్ట్ ద్వారా నీరంతా కృష్ణా నదీలో కలపడానికి చంద్రబాబు ప్రభుత్వం రూ. 2000 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు అందిస్తామన్న కేసిఆర్ ఇప్పటివరకు చుక్కనీరు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. సిపిఐ వామపక్షాలు, కాంగ్రెస్, టిడిపిలతో కలిసి ప్రజా వ్య తిరేక విధానాలను అవలంభిస్తున్న ప్ర భుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 19న జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సిఏ ఫంక్షన్‌హాల్‌లో మా నీళ్లు మాకు కా వాలి అనే నినాదంతో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏ ర్పాటుచేసి కేసిఆర్ వైఖరి పట్ల ప్రజల కు అవగాహన కల్పిస్తామన్నారు. అ నంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్ర భుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలుచేపట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 19న జరిగే అఖిలపక్షం సమావేశానికి అన్ని పార్టీల నాయకు లు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగా ణ జన సమితి నేత శ్యాంసుందర్ రె డ్డి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు నైనాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ శ్రీపతి శ్రీనివాస్, మంచిరా యల పట్టణ అధ్యక్షులు గరిగంటి కొమురయ్య, ప్రధాన కార్యదర్శి వొడా నల శ్యాంసుందర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బి.రమేష్‌నాయక్, టిడిపి జిల్లా కార్యదర్శి మల్లేష్, దుర్గం నరేష్, తదితరులు పాల్గొన్నారు.