అదిలాబాద్

కలప స్మగ్లర్లకు మంత్రి వత్తాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, జూలై 17: జిల్లాకేంద్రంలో గత 25 రోజుల క్రితం అక్రమంగా పట్టుబడ్డ కలప స్మగ్లర్ల కేసులో మంత్రి జోగురామన్న వౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని, స్మగ్లింగ్ వ్యవహారంపై సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత డిమాండ్ చేశారు. మంగళవారం కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యం లో అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం అ క్కడే కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయి ంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బ ంది కాంగ్రెస్ పార్టీ నాయకులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అటవీశాఖ కార్యాలయంలోకి అనుమతించాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య గంటసేపు తోపులాట చోటుచేసుకుంది. గండ్రత్ సుజాత మాట్లాడు తూ కోట్ల రూపాయల కలపను పట్టుకుంటే లక్షల్లో కలపను పట్టుకున్నట్లు చూపిస్తున్నారని, దమ్ము ధైర్యం ఉంటే అటవీ శాఖమంత్రి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీచేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డి మాండ్ చేశారు. మొక్కుబడి ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోవాలని మంత్రికి హితవు పలికారు. కలప స్మగ్లింగ్‌లో టీఆర్‌ఎస్ పా ర్టీకి సంబంధించిన నాయకులు ఉండ డంవల్లే కేసును తప్పుదోవ పట్టించేందుకు మంత్రి, తన కుమారులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఈవిషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదని, దోషులను పట్టుకునేవరకు పోరాడుతుందన్నారు. శాంతియుతంగా ధర్నా కార్యక్రమా లు చేపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల ను పోలీసులు అడ్డుకోవడం శోచనీయమన్నారు. మహిళ నాయకులను గౌరవించే బాధ్యత పోలీసులు, అట వీశాఖ అధికారులపై ఉందన్నారు. వె ంటనే ఈవిషయంపై సంబంధిత డిఎఫ్‌వో రెండు రోజుల్లోగా రాతపూర్వక ంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చే శారు. అనంతరం పోలీసులు, అటవీ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ అటవీశాఖ కార్యాలయం ఎదుట రో డ్డుపై బైటాయించారు. డిఎఫ్‌వో వచ్చే వరకు తమ అందోళన కొనసాగుతుందని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అ నంతరం డిఎఫ్‌వో ప్రభాకర్ సంఘట న స్థలానికి చేరుకొని గండ్రత్ సుజా త ఇచ్చిన వినతిపత్రాన్ని స్వీకరించి, కేసు వివరాలను రెండు రోజుల్లో వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. ఈవిషయ ంపై ఉన్నతాధికారులతో సైతం చర్చి ంచి చర్యలు తీసుకుంటున్నామని పే ర్కొనడంతో కాంగ్రెస్ కార్యకర్తలు శా ంతించారు. అయితే ధర్నా శిబిరానికి భారీ ఎత్తున పోలీసులు మోహరించడం పట్ల సుజాత నిరసన వ్యక్తం చేశారు. ధర్నా సందర్భంగా వన్‌టౌన్, టూ టౌన్, రూరల్ సిఐలు సురేష్, శ్రీనివాస్ ప్రతీప్, ఎస్సైలు గుణవంత్‌రావు, నరెందర్, ఏఎస్సై ఉజ్వల, స్పెషల్ పార్టీ పోలీసులు, మహిళ పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నా యకులు గిమ్మ సంతోష్, ఫరిదుల్లా, బేల మండల ఎస్సీ సెల్ నాయకులు అడెల్లు, మహేందర్‌రెడ్డి, బేల జడ్పీటీ సీ రాందాస్, మాజీ కౌన్సిలర్లు నగేష్, మంజుల తదితరులు పాల్గొన్నారు.