అదిలాబాద్

హరితహారంలో అంతా భాగస్వాములు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందమర్రి, జూలై 21: నాల్గవ విడత హరితహారంలో ప్రతీఒక్కరూ భాగస్వాములుకావాలని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తోపాటు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 22 శాతం ఉన్న అడవులు 3విడతలలో చేపట్టిన హరితహారంతో 8 నుండి 9 శాతం అదనంగా పెరిగాయని, మరింతంగా అడవులు పెరిగేందుకు అంతా సహకరించాలన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం బృహాత్తరమని ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం ఆవివేకానికి నిదర్శనమన్నారు. చిన్నా, పెద్ద, తారతామ్యం లేకుండా మొక్కలు నాటి, ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతోపాటు టిఆర్‌ఎస్ నాయకులు తిరుపతి రెడ్డి, ఎస్ ప్రభాకర్, అబ్బాస్, జే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

తాగు నీటి కోసం మహిళల ధర్నా
బెల్లంపల్లి, జూలై 21: మండలంలోని పెర్కపల్లిలో మంచి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం పెర్కపల్లి గ్రామస్తులు మహిళలు ఎడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నెల రోజుల నుండి మంచి నీరు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అనేక సార్లు మంచి నీటి సమస్యపై అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ సర్పంచ్ దుర్గం రాజేశ్వర్‌కి మంచి నీటి సమస్య తీర్చాలని కోరుతూ ఫిర్యాదు చేసిన ఆయన పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సమస్యను తీర్చేవరకు అందోళన విరమించేదిలేదని భీష్మించుకూర్చున్నారు. దీనిపై స్పందించిన ఎడీవో త్వరలో అధికారులతో మాట్లాడి నీటి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తామనడంతో ధర్నాను విరమించారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూస్తామని ఎడీవో హామీ ఇచ్చారు.