అదిలాబాద్

మంచి నేతను కోల్పోయన గిరి‘జనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జూలై 21: ఆదివాసీ పోరాట నాయకుడు సిడాం శంభు మరణం తమను ఎంతో కలిచివేసిందని, ఆయన మరణంతో మంచి నాయకున్ని కోల్పోయామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మత్తడిగూడలోని సిడాం శంభు కుటుంబాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిడాం శంభు 20వ ఏటా నుండే ఆదివాసీల హక్కులు, సంస్కృతి సాంప్రదాయాల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. అటవీ హక్కుల చట్టంలో సిడాం శంభు కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికోసం అలుపెరగని పోరాటాలు చేసి సాధించుకున్న గొప్పవ్యక్తి శంభు అకాల మరణం తమను కలిచివేసిందన్నారు. అటువంటి నాయకుని కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జగజీవన్, ఎంపిపి విమల రాథోడ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇంటింటా మొక్కలు నాటాలి
* ఎమ్మెల్యే రేఖానాయక్
ఉట్నూరు, జూలై 21: ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రుల ద్వారా రెండేసి మొక్కలు నాటే విధంగా చూడాలన్నారు. వృక్షాలతోనే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, వర్షాలు సైతం కాలానికి అనుగుణంగా పడడం వల్ల వ్యవసాయ రంగం కూడా లాభసాటిగా ఉంటుందని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడం వల్ల ప్రజలు ఆనారోగ్యం బారిన పడకుండా ఉంటారన్నారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలు నాటారు.